Pawan Kalyan – Ys Sharmila : పవన్ కళ్యాణ్ కన్నా షర్మిలే వంద రెట్లు నయం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan – Ys Sharmila : పవన్ కళ్యాణ్ కన్నా షర్మిలే వంద రెట్లు నయం?

 Authored By kranthi | The Telugu News | Updated on :21 December 2022,12:20 pm

Pawan Kalyan – Ys Sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి ఎన్ని రోజులు అవుతోంది. ఆమె వైఎస్సార్టీపీ పార్టీ పెట్టిందనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిలే హాట్ టాపిక్ అయిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో తన గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తను పార్టీ పెట్టిన కొన్ని రోజుల వరకు అసలు ఆమె పార్టీ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె ఎన్ని దీక్షలు చేసినా.. పాదయాత్ర చేసినా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

తను ఏకంగా అధికార పార్టీతోనే ఢీ అనేసరికి.. అందరి చూపు ఒక్కసారిగా వైఎస్సార్టీపీ వైపు మళ్లాయి.ఆమె ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, ఆరోపణలపై ఎక్కు పెట్టడంతో ఏకంగా ఎమ్మెల్యేలు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. తనపై దాడి జరగడం, ఆ తర్వాత ఆమె వాహనాన్ని అడ్డుకోవడం.. ఇదంతా ఏకంగా నేషనల్ మీడియాలోనే కవర్ అయింది. దేశమంతా ఈ విషయం గురించి తెలిసింది. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు.

why ys sharmila is far better than pawan kalyan

why ys sharmila is far better than pawan kalyan

Pawan Kalyan – Sharmila : షర్మిలతో పవన్ ను ఎందుకు పోల్చుతున్నారు?

అయితే.. ప్రస్తుతం వైఎస్ షర్మిలను ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోల్చుతున్నారు. ఎప్పుడూ ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం తప్పితే.. ఏదైనా సభల్లో ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే అంతకుమించి పవన్ చేసిందేమీ లేదని అంటున్నారు. కానీ.. పార్టీ పెట్టిన కొన్ని రోజులకే పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారని.. పవన్ పార్టీ పెట్టి 8 ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఏపీలో పార్టీకి అతీగతీ లేదని విమర్శిస్తున్నారు. అందుకే.. పవన్ కళ్యాణ్ కన్నా రాజకీయాల్లో వైఎస్ షర్మిల వంద రెట్లు నయం అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది