Harish Rao : సిద్ధిపేటలో హరీశ్ రావుకు నో టికెట్.. కేటీఆర్ కోసం హరీశ్ ను కేసీఆర్ పక్కన పెట్టబోతున్నారా.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : సిద్ధిపేటలో హరీశ్ రావుకు నో టికెట్.. కేటీఆర్ కోసం హరీశ్ ను కేసీఆర్ పక్కన పెట్టబోతున్నారా.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :23 January 2023,11:00 am

Harish Rao : అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు సిట్టింగ్స్ కు టికెట్లు ఇస్తారా అనేది కూడా డౌటే. నిజానికి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్స్ అందరికీ టికెట్లు అంటూ సీఎం కేసీఆర్ ముందే ప్రకటించారు. కానీ.. అసలు 10 శాతం మంది సిట్టింగ్స్ కు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే..బీఆర్ఎస్ పార్టీకి అతి ముఖ్యమైన నియోజకవర్గం సిద్ధిపేట నుంచే మంత్రి హరీశ్ రావుకు టికెట్ ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారట. సిద్ధిపేట నుంచి హరీశ్ రావును తప్పించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

హరీశ్ రావును తప్పిస్తే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీశ్ రావు ప్లేస్ లో ఎవరిని పోటీ చేయిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. హరీశ్ రావును తప్పించి మరి ఆ ప్లేస్ లో వేరే వాళ్లకు సీటు ఇస్తే వాళ్లను సిద్ధిపేట ప్రజలు గెలిపిస్తారా? అనేది తెలియదు. ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి అభ్యర్థిని నిలబెడతారు అనేది తెలియదు. నిజానికి.. హరీశ్ రావు 2004 నుంచి సిద్ధిపేటలో గెలుస్తూ వచ్చారు. ఆయనకు వచ్చే మెజారిటీ కూడా లక్షల్లో ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల పాటు సిద్ధిపేటను హరీశ్ రావు తన కంచుకోటగా ఏర్పరుచుకున్నారు. ఈనేపథ్యంలో సిద్ధిపేట నుంచి ఈసారి హరీశ్ రావుకు టికెట్ ఇవ్వకపోతే.. మరి హరీశ్ రావును పక్కన పెట్టేస్తారా కేసీఆర్ అనే అనుమానం కలుగుతోంది.

will harish rao not getting siddipet ticket again from brs

will harish rao not getting siddipet ticket again from brs

Harish Rao : 2004 నుంచి సిద్ధిపేటలో గెలుస్తూ వచ్చిన హరీశ్ రావు

కానీ.. హరీశ్ రావును పక్కన పెట్టేయడానికి కాదు.. జాతీయ రాజకీయాల్లో తనతో పాటు తీసుకెళ్లడానికి కేసీఆర్.. ప్లాన్ చేస్తున్నారట. మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారట. జహీరాబాద్ ఎంపీ టికెట్ ను హరీశ్ రావుకు ఇచ్చి గెలిపించుకొని.. జాతీయ రాజకీయాల్లో మామా అల్లుళ్లు చక్రం తిప్పాలనేది కేసీఆర్ ప్లాన్ అట. అయితే.. సిద్ధిపేట నుంచి తన అన్న కొడుకు కల్వకుంట్ల వంశీధర్ రావును ఈసారి బరిలోకి దించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. ఏది ఏమైనా.. కేటీఆర్ కు ఇక్కడ తెలంగాణలో లైన్ క్లియర్ చేయడం కోసం సీఎం కేసీఆర్ హరీశ్ రావును జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది