Kalvakuntla Kavitha : ఇది జరిగితే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ గ్యారెంటీ?
Kalvakuntla Kavitha : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒకటే చర్చ. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా? ఎప్పుడు అవుతుంది.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు. అసలు అరెస్ట్ చేస్తారా? సీఎం కేసీఆర్ ఆమెను అరెస్ట్ కాకుండా కాపాడుకుంటారా? అంటూ ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నారు. నిజానికి.. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీకి చెందిన మంత్రి మనీష్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవితకి తెలిసిన మరో వ్యక్తి అరుణ్ పిళ్లైని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఇక తదుపరి కవిత అరెస్టే అంటూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు.
మరికొందరిని కూడా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మనీష్ తర్వాత అమన్ దీప్ దాల్ ను అరెస్ట్ చేయగా.. ఆయన అరుణ్ పిళ్లై గురించి విచారణలో చెప్పడంతో ఆయన్ను కూడా తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈడీ అధికారుల ముందు అరుణ్ నోరు విప్పితే చాలు.. కవిత గురించి ఎలాంటి సమాచారం చెప్పినా వెంటనే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ సభ్యురాలుగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఆ పాలసీ విడుదలకు ముందే దాని డ్రాఫ్ట్ కాపీ అమన్ దీప్ ధాల్ వద్ద ఉంది. ఇక.. సౌత్ గ్రూప్ లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Kalvakuntla Kavitha : సౌత్ గ్రూప్ లో సభ్యులుగా ఒంగోలు ఎంపీ కొడుకు, సీఎం కేసీఆర్ కూతురు
కొడుకు రాఘవరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. మరో వ్యక్తి బోయనపల్లి అభిషేక్ కూడా ఉన్నారు. వీళ్లలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది కల్వకుంట్ల కవిత మాత్రమే. ఢిల్లీ లిక్కర్ కంపెనీలలో కవితకు 65 శాతం వాటా ఉన్నట్టుగా ఈడీ అధికారులు తెలిపారు. తనపై చార్జ్ షీట్ నమోదు చేసి హైదరాబాద్ లో కవితను విచారించారు. ఇక.. తాజాగా అన్ని ఆధారాలతో కవితను త్వరలోనే అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి ఢిల్లీ మద్యం కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.