TDP : అప్పుడే మొదలైంది.. టీడీపీలో చేరి రెండు రోజులు కాలేదు కన్నాకి బిగ్ బ్యాడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : అప్పుడే మొదలైంది.. టీడీపీలో చేరి రెండు రోజులు కాలేదు కన్నాకి బిగ్ బ్యాడ్ న్యూస్..!

 Authored By kranthi | The Telugu News | Updated on :26 February 2023,10:20 am

TDP : కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి టీడీపీలో చేరడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన అఫిషియల్ టీడీపీ నేత. కన్నా పార్టీలో చేరడంతో మరో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అలిగినట్టు తెలుస్తోంది. అసలు కన్నాను టీడీపీలో చేర్చుకోవడం ఏంటి అని అధిష్ఠానంపై ఆయన తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబునే డైరెక్ట్ గా నిలదీశారట రాయపాటి. దీంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రాయపాటికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. కన్నా లక్ష్మీనారాయణ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దని ఆదేశించారట.

will kanna laxminarayana get problems in tdp

will kanna laxminarayana get problems in tdp

తాను సీనియర్ అని.. తననే అచ్చెన్నాయుడు కట్టడి చేయడం ఏంటి అంటూ రాయపాటి పార్టీపై అలిగినట్టు తెలుస్తోంది.తనకే కాదు.. పార్టీ సీనియర్ నేతలు ఎవ్వరికీ కన్నా పార్టీలో చేరడం ఇష్టం లేదట. సీనియర్లను కాదని.. కన్నాను ఎలా పార్టీలోకి తీసుకుంటారు. టీడీపీకి ఆయన్ను చేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అని అంటున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కన్నాకు ఎన్ని సీట్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అది చంద్రబాబుకు తెలియదా? అంటూ రాయపాటి చెప్పారు.

Kanna Lakshminarayana joins TDP, Chandrababu calls him a unique leader

TDP : చంద్రబాబును, టీడీపీ నేతలను వ్యక్తిగతంగా దూషించిన కన్నా

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్నప్పుడు చంద్రబాబును, టీడీపీ నేతలను, చివరకు తమను కూడా ఎలా దూషించారో అందరికీ తెలుసు.. అంటూ రాయపాటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కన్నాకు ఏ నియోజకవర్గం ఇస్తారు.. ఇచ్చినా కూడా టీడీపీ నేతలు ఆయనకు సహకరిస్తారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కన్నా ఎక్కడ పోటీ చేసినా ఆయన్ను ఓడిస్తామని రాయపాటినే బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. ఈ నేపథ్యంలో కన్నా టీడీపీలో ఎలా మెలుగుతారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది