Kalvakuntla Kavitha : కవితను సీఎం చేస్తారా.. కవిత, కేటీఆర్ మధ్య విభేదాలున్నాయా..?
Kalvakuntla Kavitha : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవ్వరికీ అర్థం కాదు. అధికార టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది. తెలంగాణను వదిలేసి సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలను పట్టుకొని తిరుగుతున్నారు. కిసాన్ సర్కార్ అంటున్నారు. తెలంగాణలో రైతుల బాధలను పట్టించుకోకుండా.. దేశమంతా ఉన్న రైతుల బాధలు పట్టించుకుంటా అంటూ రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ.. తెలంగాణను గాలికి వదిలేస్తారా?
అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే.అయితే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కొండా సురేఖ తాజాగా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ గురించి, సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారంటే ఏదో ప్రజలను ఉద్దరించడానికి కాదు.. దాని వెనుక ఏదో గూడుపుఠాణీ దాగి ఉందంటూ చెప్పుకొచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆమె మాట్లాడిన పలు వీడియోలను షేర్ చేశారు.ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Kalvakuntla Kavitha : కేటీఆర్ అందుకే అక్కడికి వెళ్లలేదా అన్న సురేఖ
తనను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. ఈనేపథ్యంలో తనను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కవితను కాపాడాలని.. దాని కోసం.. కవితను సీఎం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది అని సురేఖ చెప్పుకొచ్చారు. అందుకే.. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లలేదు అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కవిత, కేటీఆర్ మధ్య ఎలాంటి సఖ్యత లేదని.. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది అంటూ ఆమె మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.