Nara Lokesh : లోకేష్ పాదయాత్ర వర్క్ అవుట్ అయ్యేలా లేదు? ఐడియా డ్రాప్?
Nara Lokesh : ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఒక రాజకీయ నేత పాదయాత్ర చేస్తానంటే మరో పార్టీ ఊరుకోదు. అదే అధికార పార్టీ అయితే.. ప్రతిపక్ష పార్టీని అస్సలు ముందుకు సాగనీయదు. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు గట్రా చేస్తే ప్రజలంతా ఆ పార్టీ వైపునకు తిరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి.. అందుకే.. ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవడమే అధికార పార్టీ పని. అదే ఏపీలోనూ జరుగుతోంది. ఓవైపు టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర అంటూ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 27 నుంచి పాదయాత్రకు సిద్ధం కూడా అవుతున్నారు. పాదయాత్ర కోసం కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. తాజాగా డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య.. పాదయాత్రకు అనుమతి కోరుతూ లేఖ కూడా రాశారు. దానిపై స్పందించిన డీజీపీ తిరిగి ఆయనకు లేఖ పంపారు.
అసలు పాదయాత్రకు సంబంధించిన వివరాలు అన్నీ పంపించాలంటూ కోరారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలన్నారు. దీంతో వెంటనే దానికి కౌంటర్ గా మరో లేఖను రాసింది టీడీపీ. అందులో ఇదివరకు జరిగిన పాదయాత్రలను ప్రస్తావించింది. అప్పట్లో గాంధీ చేసిన యాత్ర నుంచి మొన్న సీఎం జగన్ చేసిన పాదయాత్ర వరకు అన్నింటినీ అందులో పొందుపరిచింది. అప్పట్లో జగన్ కూడా పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కోసం డీజీపీ కోరిన వివరాలు అవసరం లేదు అంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అయితే.. లోకేశ్ పాదయాత్రలో ఎవరు ఉంటున్నారు.. ఏ నేత పాల్గొంటారు అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ.. ఇంకా యాత్ర కోసం పర్మిషన్ల దగ్గరే టీడీపీ ఆగిపోయింది.
Nara Lokesh : లోకేశ్ పాదయాత్రలో ఉండే నేతలు ఎవరు?
పాదయాత్ర రూట్ మ్యాప్ కావాలని డీజీపీ కోరారు. యాత్రలో ఎవరు పాల్గొంటున్నారు. ఎంతమంది పాల్గొంటున్నారు. వాడే వాహనాలు ఏంటి.. వాటి నెంబర్లు ఏంటి.. ఎన్ని వాహనాలు.. ఇలా అన్ని రకాల ప్రశ్నలను డీజీపీ సంధించారట. దీనిపై టీడీపీ కౌంటర్ గా మరో లేఖ కూడా పంపించింది. అప్పట్లో డీజీపీ అడగని వివరాలు.. ఇప్పటి డీజీపీకి ఎందుకు అంటూ టీడీపీ కౌంటర్ వేసింది. యాత్ర కుప్పంలో ప్రారంభం అయి.. 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్చాపురం వరకు చేరుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి.. చివరకు నారా లోకేశ్ యాత్రకు పర్మిషన్ వస్తుందా? రాదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.