Ramoji Rao : రామోజీరావు కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్ .. అసంబ్లీ సాక్షిగా..!
Ramoji Rao : మీడియా మొఘల్ రామోజీ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం అందరికీ తెలిసిందే కదా. రామోజీ రావు ముందుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏర్పాటు చేసి.. జనాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాటిని దారిమళ్లించి పలు కంపెనీలను స్థాపించి వాటిలో పెట్టుబడులు పెట్టారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ వ్యవహారంలో రామోజీ రావుకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లో నోటీసులకు సమాధానాలు ఇవ్వాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. సుప్రీంకోర్టు నుంచి రామోజీ రావుకు నోటీసులు రావడం వెనుక ఎవరు ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి వ్యవహారంపై పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి మద్దతు లభించింది. ఉండవల్లి కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో ఆ కేసుకు ఊపొచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ నిర్వహణే మోసం అని.. ఉండవల్లి తన కేసులో పేర్కొన్న విషయం తెలిసిందే.
Ramoji Rao : రామోజీ రావు మోసం నిరూపణ అయితే జైలు శిక్ష అనుభవించాల్సిందేనా?
ప్రజలతో పాటు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాలనే మోసం చేసి రామోజీ రావు డిపాజిట్లు సేకరించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. చట్టాలను ఉల్లంఘించి మోసం చేశారని ఆరోపించడంతో ఆ మోసం నిరూపణ అయితే.. రామోజీ రావుకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రూ.6500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీలోనూ సీఎం జగన్.. రామోజీ రావు గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్న సమయంలోనే రామోజీ రావు గురించి కూడా ప్రస్తావన వచ్చింది.