Pawan Kalyan : ఆ సీట్లు అన్నీ జనసేనకే కావాలి అంటోన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నెత్తిన పిడిగు లాంటి న్యూస్ !
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. అవును.. కేవలం ఒకే ఒక్క అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు ఏపీలోని ప్రత్యర్థ పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. ఏపీలో వైసీపీ మినహా ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి పని చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. పార్టీలన్నీ ఏకమై వైసీపీని ఓడించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే జనసేన పార్టీకి, బీజేపీకి పొత్తు ఉంది. కానీ.. అది పేరుకే. ఎక్కడా బీజేపీ కార్యక్రమాలకు జనసేన వెళ్లడం లేదు.
జనసేన కార్యక్రమాలకు బీజేపీ వెళ్లడం లేదు. కానీ.. జనసేన, టీడీపీ పొత్తు మాత్రం ఖరారు అయినట్టే. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ ఊవ్విళ్లూరుతోంది. కానీ.. టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఎటు చూసినా ఈ మూడు పార్టీలు కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ.. ఒకవేళ జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది. ఎక్కడ పోటీ చేస్తుంది అనేది తెలియడం లేదు.
Pawan Kalyan : జనసేన అడ్డాగా ఉన్న ఆ సీట్లను టీడీపీ ఇస్తుందా?
రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్ని సీట్లలో పోటి చేస్తుంది.. జనసేన అడ్డాగా ఉన్న సీట్లను జనసేనకే కేటాయిస్తుందా? లేదా టీడీపీ పోటీ చేస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు. నిజానికి ఉత్తరాంధ్రపైనే జనసేన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కానీ.. అక్కడ టీడీపీ కూడా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొన్ని సీట్లలో జనసేన అభ్యర్థులు కూడా దాదాపు ఖరారు అయినట్టే. మరి ఒకవేళ పొత్తు కుదిరితే ఆ సీట్లను టీడీపీ జనసేనకు ఇస్తుందా? అసలు సీట్ల లెక్కలో టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.