Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో
ప్రధానాంశాలు:
Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్ పంప్‌ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన పొందుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రజలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు అవకాశం లేకుండా, హౌస్ అరెస్టులు జరిగేవని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను స్వేచ్ఛగా వినేందుకు తలుపులు తెరిచిందని తెలిపారు.

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో
Atchannaidu : సమాజంలో చీడ పరుగులను పరామర్శించడానికి జగన్ వెళ్తున్నాడు – అచ్చెన్నాయుడు
ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పడేలా రాష్ట్రం లో మార్పులు వస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నూతన పథకాల అమలు, నేరుగా వారితో మాట్లాడే వేదికలు వంటి విషయాలపై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సిఎన్‌జి పంప్ కూడా కాలుష్యరహిత ఇంధన వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహానికి ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమేనని, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ లకు బానిసలైన వారిని, సమాజంలో చీడ పరుగులను పరామర్శించడానికి వెళ్లి జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ముఖ్యపాత్ర లేదని విమర్శించారు. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుబట్టడం అవాస్తవమని అన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి కారుకింద పడి మరణించిన వ్యక్తిపై స్పందించకపోవడం అనాగరికతకు ఉదాహరణగా పేర్కొన్నారు. జగన్‌కు మానవత్వం ఉందా? ఆయనకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు ఉందా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
జగన్ ప్రతిపక్ష నేత కాదు.. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఓ పార్టీకి అధినేత: మంత్రి అచ్చెన్నాయుడు
మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం.. ప్రశ్నించండి.. సమాధానం చెబుతాం
గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ లకు బానిసలైన వారిని, సమాజంలో చీడ పరుగులను పరామర్శించడానికి వెళ్లి జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల… pic.twitter.com/h8AJb8QQqA
— ChotaNews App (@ChotaNewsApp) July 6, 2025