Srikakulam : ఇలాంటి పోలీసులు ఎంతమంది ఉంటారు? మహిళ అయి కూడా ఈ ఎస్ఐ ఏం చేసిందో చూడండి?
ఎవరైనా దగ్గరి వాళ్లు చనిపోతేనే వాళ్లను దగ్గరి నుంచి చూడటానికి భయపడతాం. ముట్టుకోం కూడా. కానీ.. ఆయన ఎవరో తెలియదు? ఎలా చనిపోయాడో తెలియదు? అయినప్పటికీ.. మానవత్వంతో ఓ మహిళా ఎస్ఐ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమెను కొనియాడుతున్నారు. మహిళ అయినప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా.. ఆ పోలీస్ చేసిన పని హేట్సాప్ చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరుకు సమీపంలో ఉన్న పొలాల్లో గుర్తు తెలియని ఓ వృద్ధుడి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. వెంటనే కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ కు కబురంపడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న కాశిబుగ్గ ఎస్ఐ శిరీష.. గుర్తు తెలియని వృద్ధుడిని పొలం నుంచి తీసుకొచ్చి ఆసుపత్రి దాకా మోయాలంటూ అక్కడి స్థానికులను రిక్వెస్ట్ చేసింది. కానీ.. అక్కడి స్థానికులు.. ఆ మృతదేహాన్న ముట్టుకునేందుకు భయపడ్డారు. తాము మోయమన్నారు.
దీంతో… చేసేది లేక.. తనే వృద్ధుడి మృతదేహాన్ని స్వయంగా మోసి.. లలితా చారిటబుల్ ట్రస్ట్ కు అప్పగించింది. అలాగే ఆ వృద్ధుడి దహన సంస్కారాల్లో పాల్గొన్నది. ఈ ఘటన గురించి శ్రీకాకుళం జిల్లా మొత్తం తెలియడంతో.. ఎస్ఐ శిరీష్ చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు కూడా ఆమె చేసిన సేవకు మెచ్చుకున్నారు.
ఎస్ఐ శిరీష మృతదేహాన్ని మోసిన ఫోటోలు వైరల్
అయితే.. ఎస్ఐ శిరీష మృతదేహాన్ని మోస్తున్న సమయంలో.. అక్కడి స్థానికులు.. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు కూడా ఆమె చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ కాలంలో ఇటువంటి పోలీసు ఉండటం గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.
https://www.facebook.com/vasunaidu.yalakala/videos/3940861069290239