YSRCP : ధర్మాన రూట్ ఎటు? ఇక.. మంత్రి పదవి దక్కదని సైడ్ అయిపోతున్నారా..?
Dharmana prasad rao శ్రీకాకుళం : జగన్మోహన్ రెడ్డిపై అలకో లేకపోతే వారసుడి కోసం తాను సైడైపోవాలని అనుకున్నారో తెలీదు కానీ శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన ధర్మాన ప్రసాదరావు Dharmana prasad rao కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తండ్రి తరపున మొత్తం రాజకీయమంతా చక్కబెట్టేస్తున్నారు. నియెజకవర్గంలో ప్రధానంగా శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కొడుకే సుడిగాలి లాగ పర్యటనలు చేసేస్తున్నారు. శభ, అశుభ కార్యక్రమాలు, కార్యకర్తల […]
Dharmana prasad rao శ్రీకాకుళం : జగన్మోహన్ రెడ్డిపై అలకో లేకపోతే వారసుడి కోసం తాను సైడైపోవాలని అనుకున్నారో తెలీదు కానీ శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన ధర్మాన ప్రసాదరావు Dharmana prasad rao కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తండ్రి తరపున మొత్తం రాజకీయమంతా చక్కబెట్టేస్తున్నారు. నియెజకవర్గంలో ప్రధానంగా శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కొడుకే సుడిగాలి లాగ పర్యటనలు చేసేస్తున్నారు.
శభ, అశుభ కార్యక్రమాలు, కార్యకర్తల పరామర్శ, పార్టీ కార్యక్రమాలు ఇలా ఏ అవసరమైనా మొత్తం వారసుడే చక్కబెట్టేస్తున్నారు. రామ్మోహన్ స్పీడు చూసిన తర్వాత ప్రసాదరావు రాజకీయాల నుండి తప్పుకున్నారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. ఇక ప్రసాదరావు యాంగిల్లో చూస్తే 2019లో గెలవగానే తనకే మంత్రి పదవి డిసైడ్ అయిపోయారు. తన స్థానంలో తన కుమారుడికి పట్టం కట్టేలా చేయాలన్నదే ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ప్లాన్ అని టాక్ వినిపిస్తోంది.
మంత్రి పదవి రాకపోవడమేనా.. Dharmana prasad rao
నిజానికి ధర్మాన Dharmana prasad rao సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్ ఇద్దరు గెలవగానే ఎవరికి మంత్రి పదవి కావాలో వాళ్ళనే తేల్చుకోమని జగన్ చాయిస్ ఇచ్చారట. అన్న కోసం మంత్రి పదవిని త్యాగం చేయాలని తమ్ముడు కూడా అనుకున్నారని టాక్. ఇదే విషయాన్ని జగన్ కు సోదరులిద్దరు చెప్పారట. అయితే జగన్ మాత్రం ఊహించని విధంగా కృష్ణదాసునే మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్పష్టంగా చెప్పేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే సోదరులిద్దరు మాట్లాడుకుని జగన్ కు తమ ఛాయిస్ చెప్పేలోగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఎంటరయ్యారు.
టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద దువ్వాడ శ్రీనివాస్ పోటీచేసి సుమారు 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ఓటమికి ప్రసాదరావు సహకరించకపోవటమే కారణమని దువ్వాడ శ్రీనివాస్ సీఎం జగన్ కు కంప్లైంట్ చేశారని పార్టీ వర్గాల సమాచారం. వైఎస్ జగన్ కు దువ్వాడ శ్రీనివాస్ చాలా సన్నిహితుడు కావటంతో ఆయన చేసిన ఫిర్యాదును జగన్ నమ్మినట్లు ప్రచారంలో ఉంది. దీంతో ధర్మాన ప్రసాదరావుకు మంత్రిపదవి దక్కలేదని సమాచారం. ఇక మంత్రి పదవి రాదని ఫిక్సైన ధర్మాన ప్రసాదరావు.. కొడుకుని ఫీల్డ్ లోకి తేవాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వారసుడి కోసం ప్రసాదరావు ప్రయత్నిన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.