TDP : ఆ ఇద్దరు ముఖ్య నేతలు కలిసిపోయారట.. టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందా?

Advertisement

TDP తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రన్నాయుడు ఫ్యామిలీలో బాబాయ్.. అబ్బాయ్ కలిసిపోయారన్న టాక్ వినిపిస్తోంది. దివంగత నేత ఎర్రన్నాయుడి రాజకీయ వారసుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడేనన్న మాటే విభేదాలకు మొదటి అడుగుగా చెబుతారు. ఎందుకంటే.. అన్న తర్వాత తనదే అంతా అనుకున్న అచ్చెన్నాయుడికి.. అందుకు భిన్నంగా తన అన్న కొడుకు కుటుంబ రాజకీయ పగ్గాలు తీసుకోవటం నచ్చలేదని టాక్ వినిపించింది.

Advertisement

అలా మొదలైన విభేదాలు.. తర్వాతి కాలంలో తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఎర్రన్నాయుడి సతీమణి చంద్రబాబును కోరటంతో మరింత పెరిగింది. కానీ.. వారి వినతిని పక్కన పెట్టిన బాబు.. అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే టికెట్.. రామ్మోహన్ నాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ గెలవగా.. పార్టీ మాత్రం ఓడింది. మరోవైపు బాబాయ్ అచ్చెన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కాగా..తన వాక్ చాతుర్యంతో లోక్ సభలో అబ్బాయ్ తన సత్తా చాటుతూ.. ఏపీ ప్రయోజనాల గురించి దమ్ముగా మాట్లాడే నేతగా మారారు.

Advertisement
tdp
tdp

TDP బాబాయ్, అబ్బాయ్ మళ్లీ ..

ఈ మధ్యన చోటుచేసుకున్న పరిణామాలతో పార్టీలో అచ్చెన్న ప్రాధాన్యత తగ్గిందన్న మాట వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదన్న మాట పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో లెక్కలు తేడా ఉన్నప్పుడు.. తమకున్న బలం కాస్తా బలహీనతగా మారిపోతున్న విషయాన్ని గుర్తించిన బాబాయ్.. అబ్బాయ్ లిద్దరూ తాజాగా కలిసిపోయారని చెబుతున్నారు. ఇంతకాలం తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టేసిన వారు.. కలిసి ప్రయాణించాలని నిర్ణయించారట. జిల్లాలో కొత్త నేతలు వస్తుండటం..

tdp chandrababu naidu donates 1 crore to kuppam hospital
tdp chandrababu naidu donates 1 crore to kuppam hospital

తాము కలిసి ఉండకపోతే.. జిల్లాపై తమకున్న పట్టు తప్పి పోవటాన్ని గుర్తించిన వారు.. తామిద్దరం కలిసికట్టుగా ఉండాలని అప్పుడే తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత నిలుస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్న బాబాయ్ అబ్బాయ్ లు తాజాగా మాత్రం కలిసిపోయారని చెప్పక తప్పదు. అయితే ఇదెంతకాలమన్న టాక్ కూడా వైరి వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement
Advertisement