Investment Schemes : ఈ పథకంలో డబ్బులు పెడితే మహిళలకు లాభాలే లాభాలు
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్ పథకాలను రూపొందించడంలోనూ వారు ముందుండటం గమనించదగ్గ విషయం. సాధారణంగా పొదుపు చేసిన డబ్బును బ్యాంకులో ఉంచడమే కాకుండా, మంచి రాబడి వచ్చే పెట్టుబడి పథకాలలో డబ్బును పెట్టడం ద్వారా వారు భద్రమైన భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. మహిళలు తమ చిన్నచిన్న పొదుపులను పెట్టుబడి రూపంలో మార్చుకుని, దీర్ఘకాలంగా ఆదాయాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.
మహిళల కోసం కొన్ని విశ్వసనీయమైన పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి మార్గం. సంవత్సరానికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు కాగా, ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది. ఇది రిస్క్ లేని పెట్టుబడి కావడంతో, స్థిరమైన ఆదాయం కోరే మహిళలకు ఇది మంచి ఎంపిక. అలాగే, మ్యూచువల్ ఫండ్లు కూడా మరో మంచి ఆప్షన్. ఇవి మార్కెట్ ఆధారిత పెట్టుబడులు కావడంతో కొంత రిస్క్ ఉంటేను, సిప్ (SIP) రూపంలో నెలకు రూ. 500తో ప్రారంభించవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే, మంచి రాబడిని అందిస్తాయి.

Investment Schemes : ఈ పథకంలో డబ్బులు పెడితే మహిళలకు లాభాలే లాభాలు
ఇంకా బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుకన్య సమృద్ధి యోజన పథకం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 8.2% వడ్డీ లభిస్తోంది. ఇది పన్ను మినహాయింపులను కలిగించే విశిష్టతను కలిగి ఉంది. ఈ పథకంలో ఖాతా తెరవాలంటే కుమార్తె వయస్సు 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఖాతా వ్యవధి 21 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా బాలికల చదువు, వివాహం వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బును భద్రంగా సమకూర్చుకోవచ్చు. మొత్తం మీద మహిళలు ఈ విధంగా వివిధ పెట్టుబడి మార్గాలను ఎంచుకొని, ఆర్థిక భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.