Pregnant Women : తల్లి కాబోతున్న సమయంలో… వాంతులు అవుతుంటాయి… కారణం తెలుసా…?
ప్రధానాంశాలు:
Pregnant Women : తల్లి కాబోతున్న సమయంలో... వాంతులు అవుతుంటాయి... కారణం తెలుసా...?
Pregnant Women : మహిళలు తల్లి కాబోతున్నారు అని తెలిసినప్పుడు వారి ఆనందాలకు అవధులు ఉండవు. స్త్రీ మాతృమూర్తి అయితేనే ఆమె జీవితానికి ఒక పరిపూర్ణత దక్కుతుంది. సంతానం కలగని వారికి ఆ బాధ చెప్పలేం. ప్రతి ఒక్క మహిళ, వివాహం తరువాత అమ్మ కావాలని అనుకుంటుంది. కానీ స్త్రీ బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఎన్నో కష్టాలను ఎదురుకోవాలి. 9 నెలల పాటు ఆ బిడ్డను ఎంతో జాగ్రత్తగా కడుపులో మోస్తుంది. స్త్రీ కి ప్రసవం తరువాత మరలా పునర్జన్మ ఎత్తినట్లే. ఇటువంటి కష్టాలను అనుభవిస్తూ. 9 నెలల వ్యవధిలో గర్భం దాల్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు వలన ఆ మహిళకు మొదటి మూడు నెలల లో వాంతులు (Morning Sickness ) చాలా సాధారణమైన విషయం. ఎంతమందికి తొమ్మిది నెలల వరకు కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. కొంతమందికి గర్భిణీ స్త్రీలకు ఐదు నెలల వరకు వాంతులు అవుతాయి.

Pregnant Women : తల్లి కాబోతున్న సమయంలో… వాంతులు అవుతుంటాయి… కారణం తెలుసా…?
Pregnant Women : గర్భిణీ స్త్రీలకు వాంతులు అవ్వడానికి గల కారణాలు
స్త్రీ గర్భం దాల్చిన సమయంలో, శరీరంలో హార్మోన్ల స్థాయిలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా, HCG ( హ్యూమన్ కొరియోనిక్ గోనడో ట్రోఫీన్ ), ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయిలు పెరగటం వల్ల, గర్భిణీ స్త్రీలకు, వికారం, వాంతులు కలుగుతాయి. గర్భాధారణ సమయంలో, జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. కాబట్టి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది వికారం, వాంతులకు దారితీస్తుంది. గర్భాధారణ సమయంలో వాసనలకు సున్నితత్వం పెరుగుతుంది. వంటలు చేసేటప్పుడు కొన్ని రకాల వాసనలు వికారం, వాంతులు ప్రేరేపిస్తాయి. ఏది కూడా తినాలని అనిపించదు. ఎక్కువగా తినలేరు. తిన్న బయటికి వెళ్లిపోతుంది. దీంతో ఒత్తిడి, అలసట కూడా వికారం, వాంతులను ప్రేరేపిస్తాయి. గర్భధారణ సమయంలో మొదటి మూడు మాసాలలో ఉదయం సమయంలో వికారం, వాంతులు ఎక్కువగా కలుగుతాయి. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో ఎక్కువగా జరుగుతుంది.
వాతులు తగ్గించడానికి చిట్కాలు : ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, సార్ అని ఒకేసారి తీసుకోకుండా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టోస్ట్, రాకర్స్ వంటి పొడి ఆహారాలు కూడా తీసుకోండి. హైడ్రేషన్ లేని నివారించుటకు నీటిని, జ్యూసులు, కొబ్బరి నీరు వంటి ద్రవాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా అల్లం టీ లేదా అల్లం ముక్క నమిలితే వికారం తగ్గుతుంది. నిమ్మరసం లేదా నిమ్మకాయ వాసనను చూసినా కూడా వికారం తగ్గి వాంతులు ఆగిపోతాయి. వైద్యుల సలహా మేరకు విటమిన్ B6 సప్లిమెంటల్ ను తిసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు తగినంత విశ్రాంతిని తీసుకుంటూ. ఒత్తిడిని కూడా తగ్గించుకుంటే మంచిది. మసాలాలు, ఎక్కువ ఉన్న ఆహారాలు వికారాన్ని పెంచుతాయి. వాంతులు ఎక్కువ ఉంటే లేదా డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి. ఇందులో మీకు ఏదైనా సందేహం కలిగితే వైద్యుల సలహా మేరకు ఇవి పాటించండి.