Xiaomi Phones : ఆ మోడల్ ఫోన్ల మీద ధర తగ్గించిన షియోమీ.. ఇంతకీ ఏ ఫోన్, ఎంత తగ్గిందంటే?

Advertisement

Xiaomi Phones : చైనా మొబైల్ కంపెనీ అయిన షియోమీ కొత్త కొత్త మోడల్స్ తో మార్కెట్లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కొత్త మోడల్స్ మీద ఫోకస్ చేస్తూనే తాను తెచ్చిన పాత మోడల్ ఫోన్ల మీద ధర తగ్గిస్తుంది. దీంతో బాగా క్లిక్ అయిన మొబైల్స్ ధర తగ్గగానే జనాలు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ఇలాగే తాను తెచ్చిన మోడల్ ఫోన్ల మీద షియోమీ ధర తగ్గించింది. ఆ విశేషాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Xiaomi Phones : ఏ మోడల్, ఎంత తగ్గింది?

భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న మొబైల్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా తన మొబైల్ మీద డిస్కౌంట్ ప్రకటించింది. షియోమీ నుండి విడుదలైన రియల్ మీ నోట్ 10ఎస్ మోడల్ మీద ఆ కంపెనీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ మోడల్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా.. రెండు వేరియంట్ల మీద షియోమీ డిస్కౌంట్ ఇస్తోంది. రెడ్ మీ నోట్ 10ఎస్ 6జీబీ+64జీబీ వేరియంట్ మరియు 6జీబీ + 128జీబీ వేరియంట్ లో లభిస్తోంది.

Advertisement
Xiaomi Phones Company low Mobile price
Xiaomi Phones Company low Mobile price

Xiaomi Phones : ఎంత తగ్గిందంటే?

రియల్ మీ నోట్ 10ఎస్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ మొబైల్ మీద షియోమీ రూ.2000 తగ్గించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ.12,999కి లభిస్తోంది. అటు రియల్ మీ నోట్ 10ఎస్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ మొబైల్ మీద షియోమీ రూ.1000 తగ్గించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ.14,999కి లభిస్తోంది.

Xiomi Phones : రెడ్ మీ నోట్ 10ఎస్ స్పెసిఫికేషన్లు

6.43 ఇంచుల ఫుల్ HD+ డిస్ ప్లే
1080×2400 పిక్సల్ రెజల్యూషన్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్
మీడియా టెక్ హీలియో జి95 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం
వాటర్ రెసిస్టెంట్
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్
వెనకభాగంగలో 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, ముందు 13MP కెమెరా

Advertisement
Advertisement