Yashasvi Jaiswal : ఒక్క బంతికి 13 పరుగులు సాధ్యమా.. నిజం చేసి చూపించిన జైస్వాల్
Yashasvi Jaiswal : జింబాబ్వేతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 4-1 తేడాతో ట్రోఫీ సాధించింది. ఆదివారం ఐదో టీ20 మ్యాచ్ జరగగా, ఆ మ్యాచ్‌లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌తో విజృంభించడంలో 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 125 పరుగులకే కుప్పకూలింది. 42 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. ఐదో టీ20లో బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, బౌలింగ్‌లో ముఖేష్ కుమార్ రాణించి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది.
Yashasvi Jaiswal బంతికి 13 పరుగులు..!
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అతను సికందర్ రజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఔట్ కాకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికి 13 పరుగులు రాబట్టాడు. తొలి ఓవర్ లోనే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. జైస్వాల్ తన తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. అది నో బాల్. దీని తర్వాత ఫ్రీ హిట్‌పై జైస్వాల్ మళ్లీ సిక్సర్ బాదాడు. ఈ విధంగా అతను 1 బంతికి 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత, అదే ఓవర్ నాలుగో బంతికి రజా అతనిని బౌల్డ్ చేశాడు. దీంతో మరోసారి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ చూసే అవకాశం దక్కలేదు.
ఇక జింబాబ్వే బ్యాటింగ్ చూస్తే.. కెప్టెన్ రజాతో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరుకున్నారు. చివరలో ఫరాజ్ అక్రమ్ 13 బాల్స్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులు చేసి జింబాబ్వే స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన ముఖేష్ కుమార్ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. శివమ్ దూబేకు రెండు వికెట్లు దక్కాయి. అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శివమ్ దూబే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వాషింగ్టన్ సుందర్ అవార్డులను గెలుచుకున్నారు.