Janasena : టీడీపీ, జనసేన.. లాక్కోలేక, పీక్కోలేక.! ఏంటీ పాట్లు.?
Janasena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. అది కూడా విపక్షాలకు సంబంధించి మాత్రమే ఈ ట్విస్టులు. అధికార వైసీపీకి పెద్దగా టెన్షన్ ఏమీ లేదు. వైసీపీ సర్కారు తన పని తాను చేసుకుపోతోంది. మీడియా తమ ముందుకు వస్తే, వైసీపీ నేతలు అటు టీడీపీపైనా, ఇటు జనసేన మీదా నాలుగు సెటైర్లు వేసేస్తున్నారు. దానికి టీడీపీతోపాటు, జనసేన కూడా గింజుకోవాల్సి వస్తోంది. నేనే ముఖ్యమంత్రిని.. అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుండడాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటలో అరటిపండు చందాన, ‘మాదే అధికారం..’
అంటోంది బీజేపీ. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పక్కా తీర్పు ఇచ్చేశారు. జనసేన స్థాయి ఏంటో చెప్పేశారు. టీడీపీని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా.. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడితే, ప్రజల మన్ననలు అందుకునే అవకాశం వుంటుంది. అది మానేసి.. తానే ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ, చంద్రబాబు కాస్త తగ్గి తనకు మద్దతునివ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసేస్తారు. పవన్ కళ్యాణ్ మీద వన్ సైడ్ లవ్.. అంటూ చంద్రబాబు పొలిటికల్ డైలాగులు చెబుతారు. ‘మా పార్టీలోనూ ముఖ్యమంత్రి అయ్యే సత్తా వున్న నాయకులున్నారు..’ అని బీజేపీ చెబుతుంటుంది.
అసలంటూ అక్కడ వైసీపీ ఏమన్నా వెనకబడితే కదా, ముఖ్యమంత్రి పదవిని టీడీపీ, బీజేపీ, జనసేన పంచుకోవడానికి.? వైసీపీ తిరుగులేని బలంతో వుంది. 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఏమన్నా వుంటే, అదెలాగూ విపక్షాల మధ్య అనైతిక నేపథ్యంలో చీలిపోతుంది గనుక, ముమ్మాటికీ ఈసారి వైసీపీకి 2019 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే, టీడీపీతోపాటు బీజేపీ, జనసేన కూడా పగటి కలలు కనేస్తున్నాయి. సందట్లో సడేమియా కాంగ్రెస్ పార్టీ అలాగే, ప్రజాశాంతి పార్టీలు చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు.!