YSRCP Govt : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ సర్కారు షాక్.. ఆ బిల్లుకు ఆమోదం..!
YCP Govt : ఏపీలోని వైసీపీ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ తీసుకొచ్చిన బిల్లు ప్రకారం.. ఇక ఏపీలో ఏ సినిమాయైనా నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి. బెన్‌ఫిట్ షోస్‌కు పర్మిషన్ లేదు. మల్టిప్లెక్స్‌లలోనూ నాలుగు షోలు మాత్రమే వేయాలి. ఈ బిల్లు గురించి మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో మాట్లాడారు.పేద, మధ్య తరగతి ప్రజలు వినోదం కోసం సినిమా థియేటర్స్‌కు వెళితే వారిని మోసం చేస్తున్నారని, సినీ పరిశ్రమపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఆరు లేదా ఏడు షోలు వేసి ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
YSRCP Govt : సినీ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందో మరి..
తామేంచేసినా ఏం కాదనే ధోరణిలో చిత్ర పరిశ్రమ వాళ్లున్నారని పేర్ని నాని ఆరోపించారు.ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ టికెట్ విధానం వల్ల ప్రజలు నష్టపోరని పేర్కొన్నారు. ప్రజలను బలహీనతలను ఇక ఎవరూ సొమ్ము చేసుకోలేరని వివరించారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్స్, జీఎస్టీ ట్యాక్సెస్ వసూళ్లకు ఎటువంటి కంపారిజన్ లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించింది.
దాంతో అది చట్టంగా మారినట్లే.. అయితే, ఇప్పటివరకు పెద్ద హీరోల సినిమాలు విడుదలయినపుడు తొలి వారం రోజుల పాటు లేదా రెండు వారాల పాటు సినిమా బడ్జెట్ లెక్క కట్టుకుని అత్యధిక షోస్ వేసుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. టికెట్స్ రేట్లను కూడా పెంచరాదు. ఈ విషయాలపై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగిన సంగతి అందరికీ విదితమే.