Pitapuram politics : పిఠాపురంలో వేడెక్కుతున్న రాజకీయాలు…పవన్ పై గెలుపు సాధించేందుకు జగన్ వ్యూహాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pitapuram politics : పిఠాపురంలో వేడెక్కుతున్న రాజకీయాలు…పవన్ పై గెలుపు సాధించేందుకు జగన్ వ్యూహాలు…

Pitapuram politics : ముద్రగణ పద్మనాభం ను పార్టీలో చేర్చుకోవడం పై వైసీపీ ప్రభుత్వం ఆచూ చూచి అడుగులు వేస్తుంది అని చెప్పాలి. సామాజిక సమీకరణాలను అంచనా వేసి ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్లుగా పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వంగ గీతకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారంతో అధికార పార్టీ కూడా గెలుపు పై లెక్కలు […]

 Authored By tech | The Telugu News | Updated on :2 March 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Pitapuram politics : పిఠాపురంలో వేడెక్కుతున్న రాజకీయాలు...పవన్ పై గెలుపు సాధించేందుకు జగన్ వ్యూహాలు...

  •  Pitapuram politics : ముద్రగణ పద్మనాభం ను పార్టీలో చేర్చుకోవడం పై వైసీపీ ప్రభుత్వం ఆచూ చూచి అడుగులు వేస్తుంది అని చెప్పాలి. సామాజిక సమీకరణాలను అంచనా వేసి ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

  •  ఇక వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వంగ గీత కు తాజాగా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది.

Pitapuram politics : ముద్రగణ పద్మనాభం ను పార్టీలో చేర్చుకోవడం పై వైసీపీ ప్రభుత్వం ఆచూ చూచి అడుగులు వేస్తుంది అని చెప్పాలి. సామాజిక సమీకరణాలను అంచనా వేసి ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్లుగా పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వంగ గీతకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారంతో అధికార పార్టీ కూడా గెలుపు పై లెక్కలు వేసుకుంటుంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగణ పద్మనామం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసినట్లు సమాచారం. అయితే తాను పార్టీలో చేరే అవకాశం అవసరం లేదనుకుంటున్నానని ఆ లేక సారాంశం. దీంతో అధికార పార్టీ వైసీపీ పద్మనాభం ను పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుంది అని పార్టీ పెద్దలు ఆరాధిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అయితే జిల్లా నేతలు మాత్రం ఒకటే చెబుతున్నారు. మళ్లీ వెనక్కి వెళితే పద్మనామం తో వ్యవహారం మామూలుగా ఉండదని క్లారిటీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.

ఇక దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలోకి దింపాలని వైసీపీ లెక్కలు వేస్తుంది. ఇక గీతను కో-ఆర్డినేటర్ గా నియమించే సమయానికి ఈక్వేషన్స్ మరో విధంగా ఉన్నాయి. కానీ సడన్ గా పిఠాపురం స్క్రీన్ పై పవన్ ఎంట్రీ తో వైసీపీ పార్టీ వ్యూహం మార్చిందని చెప్పాలి. గీత బలమైన అభ్యర్థి అయిన కూడా పవన్ కళ్యాణ్ ను కట్టుదిట్టం చేయడానికి వేరే స్టాటజీ అమలు చేయాలని అంచన వేస్తున్నట్లు సమాచారం. ఇక ముద్రగణ ఫ్యామిలీని పార్టీలో చేర్చుకొని పోటీ చేపిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగా ఇంటర్నల్ సర్వే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి వంగా గీతను కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీకి మరో స్థానానికి పంపాలి అనే ప్రతిపాదన వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ మరియు ముద్రగణ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ సందర్భంలో దమ్ముంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయాలని ముద్రగడ సవాల్ కూడా చేశాను.

ఇక దానికి తగ్గట్లుగానే ఇప్పుడు వైసీపీ వ్యూహం ను అమలు చేస్తుంది. పవన్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఇస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని అంచనా వేస్తుంది. దీంతో గెలుపు ఓటమితో సంబంధం లేకుండా పవన్ ను కట్టడి చేసే మార్గాలను ప్రవేశపెడుతుంది అధికార పార్టీ. ఇక వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న వంగ గీత కు తాజాగా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆమె సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చింది. మార్పు చెరుపుల్లో భాగంగా పిఠాపురం వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెం దొరబాబు ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో గీతకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే గీత పిఆర్ పి తరఫున 2019లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు ముద్రగణ కొడుకు తో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. తన తండ్రిని కాదని తాను చేసేది ఏమీ లేదని ముద్రగణ కొడుకు అంటున్న మాట. కాని జిల్లా వైసీపీ నేతలు మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ముద్రగణ తో మాట్లాడగలమని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. దీనిపై వైసీపీ పార్టీ కాస్త అటు ఇటుగా ఆలోచన చేస్తున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.అయితే మొత్తానికి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఇక్కడ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి అని చెప్పాలి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది