టీడీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్న వైసీపీ ..?
ycp : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి వచ్చే ఎన్నికల దాక ఎలాంటి పదవి గండం లేదు అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఏవేవో మాయమాటలు చెప్పి టీడీపీ జనాలను మోసం చేయాలనీ చుసిన కానీ, వాళ్ళకి ప్రస్తుత పరిస్థితి ఏమిటో అర్ధం అయ్యింది. అన్ని కుదిరితే 2024 ఎన్నికల్లో కూడా జగన్ మరోసారి సీఎం అవ్వటం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ నిస్తేజకంగా మారిపోయింది. పార్టీ కేడర్ ఎక్కడిక్కడ కుదేలైపోయింది. పార్టీని నడిపించే చంద్రబాబు సత్తా తగ్గిపోయిందని తెలుగు తమ్ములు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక లోకేష్ సంగతి సరేసరి.. అయితే ఇప్పటికి కూడా టీడీపీని అంటిపెట్టుకొని కొందరు బలమైన నేతలు ఉన్నారు.. పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు టీడీపీ తోనే ఉన్నాయి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే అతని వర్గాన్ని చిన్నాభిన్నం చేయాలనే యుద్ధ వ్యూహంతో ఇప్పుడు వైసీపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో వైసీపీ ycp ఆకర్ష్ అనే పథకం పెడితే టీడీపీ నుండి అనేక మంది నేతలు జగన్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు దానికి విరామం ప్రకటించిన వైసీపీ పార్టీ, మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండు మూడేళ్లు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు కూడా లేకపోవటంతో ధైర్యంగా ఈ ఆకర్ష మంత్రాన్ని ఉపయోగించి టీడీపీలోని బలమైన నేతలను లాగే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తుంది.
ఇప్పటికే విశాఖలో విజయసాయి రెడ్డి అదే పనిలో ఉన్నాడు. తాజాగా విజయనగరంలో బొత్స సత్యనారాయణ వలసల కార్యక్రమం మొదలెట్టినట్లు తెలుస్తుంది. ఏకంగా టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ను పార్టీలోకి తీసుకొచ్చే విధంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కళా ఫ్యామిలీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగినది. రెండు జిల్లాలో కలుపుకొని నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలదు. అందుకే కళా కుటుంబానికి వైసీపీ కండువా కప్పే పనిలో ఉన్నాడు మంత్రి బొత్స. అదే కనుక జరిగితే టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.