YS Jagan : జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నాయకుల కాళ్లు చేతులు వణుకుతున్నాయి…!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో నాయకుల పనితీరుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో లేని నాయకులను మంత్రులను.. ఎమ్మెల్యేలపై గట్టిగానే వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈసారి గెలిస్తే 30 సంవత్సరాలు చూసుకో అక్కర్లేదని.. క్యాడర్ తో పాటు నాయకులకు జగన్ దిశ నిర్దేశం చేస్తున్నారు. 175/175 స్థానాలు గెలవాలని అందరు టార్గెట్ గా పెట్టుకుని.. పనిచేయాలని పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశాలలో తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రథమ ప్రాధాన్యం పార్టీకి కల్పిస్తూ.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.ఇటీవల కొంతమంది అధ్యక్షులు విషయంలో మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. వైసీపీలో బలమైన నాయకులను సైతం పక్కనపెట్టి జిల్లా అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్ ల విషయంలో సరికొత్త లిస్టు రెడీ చేయడం జరిగింది. పార్టీలో బలమైన నాయకులను జగన్ పక్కన పెట్టడంతో.. ఇప్పుడు.. వైసీపీ నాయకుల కాలు, చేతులు వణుకుతున్నాయి అని టాక్. పార్టీలో బలమైన నాయకులుగా పేరుగాంచిన సజ్జన రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లను.. జగన్ పక్కన పెట్టడం సంచలనం సృష్టించింది.
ఇంత అతిపెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ నాయకుల పనితీరు సరిగ్గా లేదని తెలుస్తోంది.కొత్త జిల్లా అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్ ల విషయంలో బడనేతలకు జగన్ ఇచ్చిన షాక్ తో… వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వనికి పోతున్నారట. దీంతో జగన్ ఇచ్చిన ఆదేశాలు మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలలోనే ఉంటూ.. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో లేని నాయకులను పక్కన పెట్టేస్తానని.. నిర్మొహమాటంగా జగన్ పలు సందర్భాలలో చెప్పటంతో వచ్చే ఎన్నికల టికెట్ల విషయానికి ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారట. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల విషయంలో జగన్ … గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే రీతిలో నేతల పనితీరుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు సమాచారం.