నిజంగానే రఘురామకృష్ణంరాజును విచారణ సమయంలో కొట్టారా? లేదా? హైకోర్టుకు రిపోర్ట్ అందించిన ఆర్మీ డాక్టర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నిజంగానే రఘురామకృష్ణంరాజును విచారణ సమయంలో కొట్టారా? లేదా? హైకోర్టుకు రిపోర్ట్ అందించిన ఆర్మీ డాక్టర్లు

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 May 2021,12:26 pm

రఘురామకృష్ణంరాజు తెలుసు కదా. పేరుకు వైఎస్సార్సీపీ ఎంపీనే కానీ.. ఆ పార్టీని ఆయన ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. రెబల్ ఎంపీగా మారిన రఘురామ.. వైసీపీ పార్టీపై, ఏపీ సీఎం జగన్ పై చాలా విమర్శలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ఆయన్ను విచారించే సమయంలో అధికారులు.. తీవ్రంగా కొట్టారని ఆయన జడ్జికి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు.. డాక్టర్ల బృందానికి ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆయన కాలుకు ఏమైందో పరీక్షలు చేయాలని ఆదేశించగా… అయితే.. గుంటూరు మెడికల్ బోర్డు.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎంపీని ఎవరూ కొట్టలేదని.. ఆయన కాలుకు అయింది గాయాలు కాదని.. అది పాదాల రంగు మారిందని.. దానికి కారణం ఎడీమా అనే సమస్య అని చెప్పుకొచ్చింది మెడికల్ బోర్డ్.

ycp mp raghurama krishnam raju reports on his injuries

ycp mp raghurama krishnam raju reports on his injuries

అయితే.. మెడికల్ బోర్డుతో పాటు క్రాస్ చెకింగ్ కోసం రమేశ్ హాస్పిటల్ వైద్యులతోనూ పరీక్షలు నిర్వహించాలని రఘురామ తరుపు లాయర్ డిమాండ్ చేయడంతో.. దాన్ని సీఐడీ తరుపున వాదిస్తున్న లాయర్ వ్యతిరేకించారు. దీంతో.. ఎంపీ రఘురామ కొడుకు భరత్.. ఎందుకు.. తన తండ్రికి వైద్య పరీక్షలు చేయిస్తామంటే వద్దంటున్నారంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. తన తండ్రికి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాని కోరారు. అయితే.. ప్రస్తుతం రఘురామ ఏపీలో ఉన్న కారణంగా.. సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

శుక్రవారం విచారణలో బయటపడనున్న రఘురామ పరీక్షల రిపోర్ట్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలను డాక్టర్లు నిర్వహించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో.. వీడియో కూడా తీశారు. వైద్య పరీక్షలను, దాని రిపోర్టును, వీడియో ఫుటేజ్ ను మొత్తం.. హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆర్మీ డాక్టర్లు అందించగా.. దాన్ని హైకోర్టు రిజిస్ట్రార్.. సుప్రీంకోర్టుకు పంపించారు. అయితే.. వైద్యుల పరీక్షల్లో ఏం తేలింది.. అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఆ విషయం.. సుప్రీంకోర్టు విచారణ జరగనున్న శుక్రవారం బయటపడుతుంది. దీంతో.. ప్రస్తుతం ఏపీలోని అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలైందట. ముఖ్యంగా వైసీపీ పార్టీల నేతల్లో. శుక్రవారం రోజున రిపోర్టులో ఏం ఉంటుందో.. ఏం తెలుస్తుందోనని అంతా తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం నాడు వచ్చే రిపోర్టు ఆధారంగానే… రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితం ఆధారపడి ఉంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది