అవునా.. చంద్రబాబు ఓడిపోయే ముందు అంతపని చేశారా? విజయసాయి ట్వీట్?
అసలే కొత్త రాష్ట్రం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. రాజధాని కూడా లేదు. ఉన్నవన్నీ రెండో శ్రేణి నగరాలే. ఒక్క మెట్రో సిటీ కూడా లేదు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఒక్కటన్నా ఏపీలో ఉందా లేదు.. మరి.. ఏపీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. తెలంగాణ కంటే హైదరాబాద్ ఉంది కాబట్టి.. ఎలాగోలా అక్కడి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. మరి.. ఏపీ సంగతి?
కొత్త రాష్ట్రాన్ని గట్టెక్కించడం పక్కన పెడితే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. అంటూ చంద్రబాబుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఏపీని అప్పుల రాష్ట్రంగా చంద్రబాబు మార్చారంటూ వైసీపీ నేతల ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ వదిలారు.
సాధారణంగా విజయసాయిరెడ్డి.. ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబుపై ఏదైనా విమర్శ చేయాలంటే ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలోనే అటువంటి విమర్శలు వదులుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఓ సంచలన ట్వీట్ చేశారు.
ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ వచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంవత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా? కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబూ.. అంటూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్ లో ట్వీట్ చేశారు.
ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా పాలనాదక్షుడు అనే ఎలివేషన్ ఇచ్చింది. దిగిపోయే ముందు ఆఖరి సంత్సరంలో 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజా ధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా? కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 7, 2020