Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహికి జగన్ మార్క్ స్పీడ్ బ్రేకర్..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 2 January 2023, 6:20 pm

Pawan Kalyan : కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలోనే ఏపీ రాజకీయాలు ఇంకాస్త వేడెక్కనున్నాయి. ఎందుకంటే.. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. అది కూడా వచ్చే సంవత్సరం ఎండాకాలంలో ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరమే రాజకీయ పార్టీలు ఏదైనా చేసేది. అందుకే.. ఓవైపు టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను ప్లాన్ చేస్తుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో త్వరలో ఏపీ మొత్తం తిరగనున్నారు. వీళ్లు ఈ యాత్రలు చేస్తే ఖచ్చితంగా వైసీపీకి అంతో ఇంతో నష్టం వాటిల్లుతుంది.

అందుకే.. వైసీపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. నిజానికి.. టీడీపీ, జనసేన పార్టీలకు లేని ప్లస్ పాయింట్ వైసీపీకి ఉంది. వైసీపీ అధికారంలో ఉండటమే వైసీపీకి కలిసి వచ్చే అంశం. అయినప్పటికీ వైసీపీని ఢీకొట్టి మరీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని దానికోసం యూత్ ఆకట్టుకోవాలని ఓవైపు లోకేశ్, మరోవైపు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. మరి.. వీళ్లను తట్టుకొని మరీ సీఎం జగన్ ప్రజలను తన వైపునకు, తన పార్టీ వైపునకు తిప్పుకోవాలి.ఎలాగూ కొత్త ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఓవైపు, నారా లోకేశ్ మరోవైపు యాత్రలు చేయబోతున్నారు.

ycp new counter to pawan kalyan varahi tour

ycp new counter to pawan kalyan varahi tour

Pawan Kalyan : వాళ్ల యాత్రలకు పోటీ జగన్ ఏం చేయబోతున్నారు?

మరి.. వీళ్లను ఢీకొట్టడానికి.. సీఎం జగన్ ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి వీళ్లనే టార్గెట్ గా చేసుకొని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకూ ప్రభుత్వం పేరుతో సీఎం జగన్ పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్ల యాత్రకు బ్రేక్ వేయాలంటే సీఎం జగన్ కూడా ఏదైనా యాత్ర ప్రారంభిస్తారా? లేక ఎప్పటికీ వైసీపీ నేతలు జనాల్లో ఉండేలా మరేదైనా కార్యక్రమం చేపడతారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp