YCP : ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ సీరియస్ నిర్ణయాలు..!!
YCP : వైసీపీ అధినేత జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిస్తే ఇక 30 సంవత్సరాలు పాటు తిరుగుండదని నేతలకు ప్రతి సమావేశంలో తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో నాయకులు ఎక్కువగా ప్రజలలో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యధిక ఎన్నికలు వైసీపీ పార్టీ అలవోకగా గెలవడం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులలో సంతోషం నెలకొంది.
దాదాపు పది లక్షలకు పైగా ఓటర్లు 9 జిల్లాలలో 108 నియోజకవర్గాలలో విస్తరించిన వాళ్లు టీడీపీకే పట్టం కట్టడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. విషయంలోకి వెళ్తే నిన్న మొన్నటి వరకు గ్రామ…వార్డు సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ల వ్యవస్థ పై ఆధారపడ్డ వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఈ కోటాలో ఉన్న
ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఏడు స్థానాలు దక్కించుకొని మునుపటి మాదిరిగా సత్తా చాటాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి… బాధ్యతను కొంతమంది సీనియర్ నేతలకు జగన్ అప్పగించారట. దీంతో సదరు మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి… నియోజకవర్గ సమస్యలు ఇంకా నిధులు ఏం కావాలంటే విషయాలపై ఆరా తీయటం మాత్రమే కాదు ఆఫర్లు కూడా ఇస్తున్నారట. ఈ రకంగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే విధంగా వైసీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.