YS Jagan : లేట్ ఐనా మంచి పాయింట్ మీద టార్గెట్ పెట్టిన వైఎస్ జగన్.. వైసీపీ లో రిపైర్లు మొదలు
YS Jagan : ఏ పార్టీలో అయినా అసమ్మతి నేతలు ఉండటం సహజం. పార్టీలో ఏదో ఒకటి నచ్చక కొందరు అధిష్ఠానానికి ఎదురు తిరుగుతారు. పార్టీలో అసమ్మతి నేతలుగా ఎదుగుతారు. కొందరైతే రెబల్స్ గా మారి పార్టీకే చెడ్డ పేరు తెస్తారు. మరికొందరు సింపుల్ గా పార్టీ మారుతారు. అయితే.. అసమ్మతి నేతల వల్ల పార్టీకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది అనే మాట వాస్తవం. అందుకే వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. కానీ.. ఎన్నికలు సమయంలో అప్పటికప్పుడు ఏవైనా మార్పులు చేస్తే.. టికెట్ దక్కని నేతలు రోడ్డెక్కితే ఏంటి పరిస్థితి. అప్పుడు పార్టీ పరువు గంగలో కలుస్తుంది కదా. అందుకే..
ఏ నేతకూ అలాంటి అవకాశం ఇవ్వకూడదని సీఎం వైఎస్ జగన్ యోచిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు జగన్. పార్టీ బాధ్యతలను కీలక నేతలకు సీఎం జగన్ అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదు అని అనుమానం ఉన్నవాళ్లు.. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు. తమకు ప్రత్యర్థులుగా ఎవరు ఎదుగుతారో అని విమర్శలు చేస్తున్నారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరిని వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
YS Jagan : సర్వేలో నెగెటివ్ వచ్చిన వాళ్ల ఖేల్ ఖతం
అందుకే సర్వేలు నిర్వహించి.. ఎమ్మెల్యేల పనితీరు, వాళ్లకు ఉన్న పాపులారిటీకి సంబంధించిన నివేదికలను సీఎం జగన్ తెప్పించుకుంటున్నారు. సర్వేల్లో పాజిటివ్ రాని వాళ్లను నిర్మొహమాటంగా పక్కన పెడతానని జగన్ హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ముందే ఉప్పందితే వాళ్లు వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవేళ వేరే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఇక్కడే అసమ్మతి వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నవారు. ఇవన్నీ తెలుసుకొని పార్టీలోని విభేదాలను పరిష్కరించడానికి ముఖ్య నేతలు మంతనాలు కూడా మొదలు పెట్టారు. ఒకవేళ అప్పటికి అసమ్మతి నేతలు దారికి వస్తే ఓకే కానీ.. రాకపోతే వాళ్లను వారి విచక్షణకే వదిలేయాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. కొందరు అసమ్మతి నేతల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరిస్తామని సీఎం జగన్ మాటిస్తున్నట్టు తెలుస్తోంది.