IPL Betting : ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తండ్రి.. ఈయన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

IPL Betting : ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తండ్రి.. ఈయన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.. వీడియో

IPL Betting : కన్నపిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్లకు ఉన్న ఆర్థిక స్థోమత కష్టపడి పిల్లలను బాగా చదివించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగుల్చుతున్నారు పిల్లలు. విశాఖ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడి చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. దీనికి సూత్రధారి ఒక వ్యక్తి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 April 2023,7:00 pm

IPL Betting : కన్నపిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్లకు ఉన్న ఆర్థిక స్థోమత కష్టపడి పిల్లలను బాగా చదివించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తే తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగుల్చుతున్నారు పిల్లలు. విశాఖ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడి చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. దీనికి సూత్రధారి ఒక వ్యక్తి అని.. కాలేజీ కుర్రాళ్లను ట్రాప్ చేసి వాళ్లకు డబ్బులు ఇస్తాడట.

18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లను ట్రాప్ చేసి.. వాళ్లకు అప్పులు ఇచ్చి ఐపీఎల్ బెట్టింగ్ లు వేసేలా ప్రోత్సహిస్తాడు అంటున్నారు. ఫార్మసీ కంపెనీలో పని చేసేవాడు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లను చేరదీసి.. వాళ్లకు అప్పు ఇచ్చేవాడు అంటూ.. ఆ పిల్లాడి తండ్రి వెక్కి వెక్కి ఏడ్చాడు.మీకు ఎందుకు.. ఏం కాదు. డబ్బులు తీసుకో.. బెట్టింగ్ వేయ్ అని రెచ్చగొడతారు అంటూ చెప్పుకొచ్చాడు. అటువంటి వాళ్లు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు అని వాళ్లను పట్టుకొని వాళ్లను ట్రాప్ లోకి దించాడు అంటున్నారు.

young man kills himself after lost in ipl betting in vizag

young man kills himself after lost in ipl betting in vizag

IPL Betting : అప్పు ఇచ్చి పూర్తిగా వాళ్ల కంట్రోల్ లోకి తీసుకుంటారు

నా కొడుకు ఎలాగూ వెళ్లిపోయాడు. వేరే పిల్లలు కూడా అతడి ట్రాప్ లో పడకండి. తల్లిదండ్రుల మాట వినండి. వాళ్లే మీ సమస్యలను తీర్చుతారు. తల్లిదండ్రులే మీ రక్ష. వాళ్లు మీ కష్టాలన్నీ తీర్చుతారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఇదంతా జరుగుతోందని. నా కొడుకు చనిపోయి.. అందరికీ కనువిప్పు కలిగించాడు. మీరు అంతా ఆ నాయుడి వలలో పడకుండా మీ తల్లిదండ్రుల మాటే వినండి అంటూ ఆ కుర్రాడి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది