YS Jagan : 150 ప్లస్ మళ్ళీ సాధిస్తే.! వైఎస్ జగన్‌కి ఎదురే లేదు.!
YS Jagan : వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 ప్లస్ సీట్లు సాధిస్తుందని ఓ సర్వే తేల్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఈ మేరకు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వైసీపీ, అలాగే వైసీపీ అనుకూల మీడియా చేసుకుంటున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత.? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, 151 నియోజకవర్గాల్లో బంపర్ విక్టరీ అందుకుంది. మళ్ళీ అంతటి విజయాన్ని, అంతకు మించిన విజయాన్ని అందుకోబుతున్నామని వైసీపీ చెప్పవడంలో వింతేమీ లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, 175 సీట్లలోనూ ఎందుకు గెలవలేం.? అని ఈ మధ్యనే శాసన సభాపక్ష సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ అయినా, మొత్తం అన్ని సీట్లలోనూ పోటీ చేయాలని ఎందుకు అనుకుంటుంది.? అన్నిటిలోనూ గెలవడానికే. అయితే, అది సాధ్యమా.? అసాధ్యమా.? అన్నదే అసలు చర్చ. ఎందుకు సాధ్యం కాకూడదు.? అని వైసీపీ అనుకోవడాన్ని కూడా తప్పు పట్టలేం. అయితే, 2014 ఎన్నికల నాటికీ ఇప్పటికీ చాలా తేడా వుంది. చంద్రబాబు మాయమాటలు చెప్పి, అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చేశారనీ, తాము నిఖార్సయిన అభివృద్ధి అమరావతిలో చేస్తామని వైఎస్ జగన్, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు పూర్తి చేయలేకపోయారనీ, తాము చేస్తామనీ హామీ ఇచ్చారు. ఇవన్నీ ఆన్ రికార్డ్ వ్యవహారాలు. చ్చితంగా 2019 ఎన్నికల్లో ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. ఏం చెప్పారు.? ఏం చేశారు.? అన్ననది ప్రజలే బేరీజు వేసుకుంటారు. ఒకవేళ ప్రజలు ఇంకోసారి వైఎస్సార్సీపీని నమ్మి, 150 కంటే ఎక్కువ సీట్లు వైసీపీకే ఇస్తే, రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలేవీ ఆ తర్వాత మనుగడ సాధించే అవకాశమే వుండదు. మళ్ళీ కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం పుట్టుకు రావాల్సిందే. ఇంతకీ, ఈ ఈక్వేషన్‌తో వైసీపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతోందా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు చక్కర్లు కొడుతున్నాయి.? ఏమోగానీ, వైసీపీ అయితే ఈ తాజా సర్వేతో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఇదే జోష్‌లో ముుందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.