Ys Jagan : కొత్త మంత్రులతో జగన్ కు కొత్త తలనొప్పి… తల పట్టుకున్నఅధినేత
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో దేశంలోనే టాప్ అన్నట్లుగా దూసుకు పోతున్నారు. ప్రజలు అంతా కూడా వైఎస్ జగన్ కు ఎంత మద్దతుగా ఉన్నారో ఇటీవల జరిగిన ఎన్నికలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కాని సొంత పార్టీ నాయకుల కుమ్ములాటల కారణంగా పార్టీకి నష్టం తప్పడం లేదు అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్లు జూనియర్లు అంటూ జరుగుతున్న గొడవపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Ys Jagan : కొత్త వారికి మంత్రి పదవులు..
సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల కారణంగా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కొందరు సీనియర్ లు ఉన్నా కూడా వారికి మంత్రి పదవులు ఇవ్వలేక పోయాడు. కొత్త వారు సీనియర్ లను కలుపుకుని పోవాల్సి ఉంటుంది. కాని మంత్రి పదవి వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకుని నియోజక వర్గాల్లో మరియు వారి జిల్లాల్లో హడావుడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో సీనియర్ ఎమ్మెల్యేలు కోపంతో రగిలి పోతున్నారు. తమకు ప్రతి పనిలో అడ్డు రావడంతో పాటు సీనియర్లం అన్న గౌరవం కూడా చూపించడం లేదు అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Ys Jagan : జగన్ చర్చలు..
సీనియర్ ఎమ్మెల్యేలు ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వారి విషయంలో కాస్త అసూయతో ఉంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి నేపథ్యంలో కొత్త మంత్రులు వెళ్లి జిల్లాలో తమ ప్రాభల్యం పెంచుకునేందుకు ప్రయత్నించడం వల్ల మరింతగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ప్రచారం చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే చర్చలు జరిపి గొడవలను పరిష్కరించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. మరి జగన్‌కు ఈ తలనొప్పి తగ్గేనా ముందు ముందు మరింతగా పెరిగేనా అనేది చూడాలి.