YS Jagan : వైఎస్ జగన్ ఛారిత్రాత్మక నిర్ణయం.. 2024లో గెలుపు ఖాయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైఎస్ జగన్ ఛారిత్రాత్మక నిర్ణయం.. 2024లో గెలుపు ఖాయం

 Authored By prabhas | The Telugu News | Updated on :9 April 2022,7:00 am

YS Jagan : సాధారణంగా మంత్రి వర్గంలో ఒకరిద్దరిని తొలగించి కొత్తగా ఒకరిద్దరిని తీసుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయంగా చెబుతూ ఉంటారు. మంత్రివర్గ విస్తరణ అనేది కచ్చితంగా తేనె తుట్టె కలపడం వంటి కార్యక్రమం. సాఫీగా జరుగుతున్న పరిపాలనలో మార్పులు తీసుకు రావడం.. అలాగే పార్టీలో అలజడి రేపడం వంటిది అంటూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రాజకీయ అనిశ్చితికి కారణమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.ఒకరిద్దరు కాకుండా మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి వాటిని ఆమోదింప చేసి మళ్ళీ కొత్తగా 25 మంది మంత్రులను తీసుకోవడం

వారితో ప్రమాణస్వీకారం చేయించడం అనేది కచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయం అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సారి ఇంత మంది మంత్రులతో రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఐదు సంవత్సరాల పాటు మంత్రులుగా కొనసాగే అవకాశం తమ మంత్రి పదవులు సీఎం అడిగాడంటూ ఇచ్చేయడం వారికే చెల్లింది. సీఎం జగన్ పై వారికి ఉన్న నమ్మకం పార్టీలో వారికి కల్పించబోతున్న స్థానం నేపథ్యంలోనే మంత్రి పదవిని చాలా ఈజీగా వదిలేసారు.తాజాగా మాజీలు అయిన వారంతా కూడా ఇప్పుడు పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

YS Jagan AP Cabinet dissolved

YS Jagan AP Cabinet dissolved

పార్టీ కోసం పని చేసిన వారిలో కొందరికి కొత్తగా మంత్రి పదవులు దక్కబోన్నాయి. ఇలాంటి రాజకీయం చాలా కొత్తగా ఉందని భవిష్యత్తులో జగన్ ని ఫాలో అయ్యే వారు కూడా ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఉద్దండుడు అని పేరు దక్కించుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో జగన్ చేస్తున్న పనిని నోరు వెళ్లబెట్టి మరీ చూస్తున్నాడు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో కచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సీఎం అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది