YS Jagan : కాంగ్రెస్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీలకం.. అది అయ్యేను వైఎస్ జగన్ కు బలం
YS Jagan : రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పెంట… చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏకంగా రాష్ట్రం విడి పోయాక సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన ఒక్క స్థానంను గెలవలేక పోయాడు అది వేరే విషయం. ఆయన వల్ల ఏపీలో కాంగ్రెస్ దారుణంగా నష్టపోయింది. అయినా కూడా రాష్ట్రం విడిపోయి పరిస్థితులు కుదుట పడ్డ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధినాయకత్వం బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
గతంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చి పీసీసీ చీఫ్ గా చేయాలని అధినాయకత్వం భావించింది. కాని రాష్ట్రంలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ను భుజానికి ఎత్తుకోవడం తన వల్ల కాదన్నాడు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ పార్టీకి జవసత్వాలు నింపాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం
రెండు మూడు నెలల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఎంత కాదన్నా కూడా ఏపీలో కాంగ్రెస్ కు ఎంతో కొంత ఓటు బ్యాంకు అయితే ఉంది. ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కాపాడుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు. అందుకు కారణం వైకాపా పై వారు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటే ఆ ఓట్లు టీడీపీకి వచ్చేవి. కాని కిరణ్ కుమార్ ఆ ఓట్లు దక్కించుకుంటే టీడీపీ ఆశలు గల్లంతు.. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయితే ఖచ్చితంగా జగన్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు.