YS Jagan : భారీ స్కెచ్ తో దిగిన జగన్.. రాజకీయ పండితులే వహ్వా అంటున్నారు !
YS Jagan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ లాంటి ప్రధాన పార్టీల మధ్యనే ఏపీలో తీవ్ర పోటీ నెలకొన్నది. వైసీపీ ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఒకసారి గెలిచి తన సత్తా చాటిన సీఎం జగన్.. రెండో సారి గెలిచి మరోసారి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీలోని ముఖ్య నేతలకు ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు.
ఆయన ఏదైనా స్కెచ్ వేశారంటే ఇక మామూలుగా ఉండదు. టీడీపీకి నిద్ర ఉండదు. తాజాగా సీఎం జగన్.. టీడీపీ యువనేత నారా లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆయన మీద పెద్ద స్కెచే వేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ ఓడిపోయిన విషయం తెలుసు కదా. మరోసారి మంగళగిరి నుంచి నారా లోకేశ్ ను ఓడించడమే టార్గెట్ గా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించేందుకు పక్కా ప్లాన్ వేశారు జగన్. ఇప్పుడు నారా లోకేష్ వంతు వచ్చింది.
YS Jagan : 5300 ఓట్ల తేడాతో ఓడిపోయిన నారా లోకేష్
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఖచ్చితంగా గెలుస్తారని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా ఆయన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచే నారా లోకేష్ పోటీ చేసే అవకాశం ఉన్నందున మరోసారి లోకేష్ ను ఓడించడం కోసం ఇప్పటి నుంచే జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మంగళగిరితో పాటు తాడికొండ నియోజకవర్గంలో కూడా టీడీపీని ఓడించి అమరావతి ప్రజలు టీడీపీని కాదని వైసీపీ ఆదరిస్తున్నారని చాటిచెప్పడం కోసం సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి జగన్ ప్లాన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?