Ys jagan
Ys Jagan వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ botsa satyanarayana బాగానే చక్రం తిప్పుతున్నారు. ఫైర్ బ్రాండ్‌కు కొంచెం తక్కువే అయినా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్.. ఆపార్టీ నేతలపై విమర్శలు చేయడంలోనూ బొత్స సత్యనారాయణ botsa satyanarayana దూకుడుగానే ఉన్నారు. ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మంచి మార్కులు పొందారు. అయితే.. ఇంతగా మంచిమార్కులు కొట్టేసి.. ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తున్నా బొత్స సత్యనారాయణకు రావాల్సిన పేరు రావడం లేదు.. దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. దీంతో బొత్స సత్యనారాయణ కుటుంబ రాజకీయ ఫ్యూచర్ ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ కేబినెట్‌లో బొత్స సత్యనారాయణ కీలకంగా ఉన్నారు. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోనూ బొత్స సత్యనారాయణకు మంచి పలుకుబడి ఉన్న విషయం తెలిసిందే.
Ys jagan
గతంలో వైఎస్ఆర్ హయాంలోనూ మంత్రిగా బొత్స సత్యనారాయణ వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. తన సతీమణి ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇప్పించుకుని బొత్స సత్యనారాయణ గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పదవి కోసం కూడా ట్రై చేశారు. అయితే.. అది రాకపోయినా.. ఎంపీగా మాత్రం మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ సతీమణి, ఆయన కుమారుడు రాజకీయాల్లో మళ్లీ రీ యాక్టివ్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స ఝాన్సీ.. మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ కుమారుడు కూడా తాను పోటీకి రెడీగా ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు.
ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నా బొత్స సత్యనారాయణకు విజయనగరం జిల్లాలో చీమ చిటుక్కుమన్నా తెలిసేది. కానీ ఇప్పుడు వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణను అన్ని విధాలా వాడుకుంటున్నా లోకల్ గా సైలెంట్ చేసేసిందని కేడర్ చర్చించుకుంటున్నారు. విజయనగరం సిటీలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాటే చెల్లుబాటు అని వైఎస్ జగన్ చెప్పేశారని తెలుస్తోంది. అటు రాజన్నదొర, పుష్ప శ్రీ వాణి నియోజకవర్గాల్లోనూ బొత్స సత్యనారాయణ మాట చెల్లడం లేదు. దీంతో విజయనగరంలో బొత్స సత్యనారాయణ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టే వ్యూహాలు వైసీపీలో అమలు అవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట చెల్లుబాటు కావడం లేదని.. బొత్స సత్యనారాయణ వర్గం ఒంటరైందని ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
botsa satyanarayana
విజయనగరానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో బొత్స సత్యనారాయణకు విబేధాలు ఉన్నాయి. గతంలో మున్నిపాలిటీ ఎన్నికల సమయంలో కోలగట్ల వీరభద్రస్వామి మాటే నెగ్గింది. తాజాగా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావుతోనూ చెడిందని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ botsa satyanarayana తన వర్గానికి స్థానిక పోరులో సీట్లు కూడా ఇప్పించుకోలేకపోయారు. త్వరలో జరిగే నామినేటేడ్ పదవుల్లో సైతం బొత్స సత్యనారాయణ వర్గానికి చెక్ పెట్టే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. చేతిలో మంత్రి పదవి ఉన్నా ఏం చేయలేని పరిస్థితి ఉందంటూ సన్నిహితుల దగ్గర బొత్స సత్యనారాయణ వాపోయినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చేస్తే మంత్రి వర్గ విస్తరణలో బొత్స సత్యనారాయణ botsa satyanarayana ను కొనసాగిస్తారా..? తప్పిస్తారా అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. దీంతో బొత్స సత్యనారాయణ భార్య ఎంపీ సీటు, బొత్స కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఆశలు నెరవేరేనా అన్న టాక్ స్థానికంగా వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి ==> వీళ్లు అటా.. ఇటా.. చంద్రబాబుకు దమ్కీ ఇచ్చి.. వైసీపీలో ఈ నలుగురు నేతలు చేరినట్టేనా?
ఇది కూడా చదవండి ==> రూట్ మార్చిన ఆ ఎమ్మెల్యే.. సీఎం జగన్ కే ఎసరు పెడుతున్నాడా?
ఇది కూడా చదవండి ==> వైఎస్ జగన్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటదా? కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది ఆ మంత్రి పరిస్థితి?
ఇది కూడా చదవండి ==> కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న ఆ టీడీపీ నేత ఆశ.. ఈసారైనా నెరవేరుతుందా?
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
This website uses cookies.