Ys Jagan : జన సంక్షేమ పాలనకు 1000 రోజులు
Ys Jagan : వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తి అయ్యింది. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి మొదటగా చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యారు. ఆయన పరిపాలన పై రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు అధికారంలో కట్ట బెట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలో కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు తీసుకెళ్లలేక పోయారు.అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలను కూడా గాలికి వదిలేశారు దాంతో నవరత్నాల హామీ తో ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనూహ్య స్పందన దక్కింది.
ఆయనను సీఎంగా ఎన్ను కోవడమే కాకుండా అద్భుతమైన మెజారిటీని కూడా ఏపీ ప్రజలు ఇచ్చారు. ఏపీ ప్రజలు అద్భుతమైన మెజారిటీని ఇవ్వడంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి రుణం తీర్చుకోవడం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను కూడా తీసుకు వచ్చారు.బడుగు బలహీన ప్రజల కోసం ఆయన తీసుకు వచ్చిన పథకాలు ఎన్నో మంచి పేరుని సంపాదించాయి. దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కించుకున్నాయి. ఈ వెయ్యి రోజుల పరిపాలన లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం ఒక అద్భుతం అంటూ ప్రతిపక్ష నాయకులు కూడా ఒప్పుకునే విషయందేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకు రావడంతో పరిపాలన అనేది చాలా సులభతరం చేశారు.
ఇక మూడు రాజధానులు విషయం పై సీఎంగా జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. వచ్చే రెండేళ్లలో అద్భుతాలను ఆవిష్కరిస్తాము అంటూ హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో తదుపరి ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనే నమ్మకం ను వైకాపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైకాపా అభిమానులు మరియు కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ట్రెండింగ్లో ఉంటున్నారు.