
ap govt announced new 26 districts in state
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాగా, ఇటీవల కాలంలో జగన్ తన పార్టీపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని ఇంకా బలోపేతం చేయడంతో పాటు నేతల పనితీరును సమీక్షించి వారిలో అసంతృప్తులను బుజ్జగించాలని భావిస్తున్నట్లు సమాచారం.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 సాధారణ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుపొందాడు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు జగన్‌కు అండగా నిలబడ్డారు. అందులో కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమ్మ కులానికి ప్రయారిటీ ఇవ్వడం లేదని విమర్శలొస్తున్నాయి.
Ys jagan decisions on mlc elections
ఈ నేపథ్యంలోనే జగన్ ఈసారి 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎక్కువ మందిని అభ్యర్థులుగా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కేబినెట్‌లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు మంత్రిగా ఉన్నారు. మొత్తంగా ఈసారి కమ్మ కులానికి ప్రయారిటీ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. జిల్లాల వారీగా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లను జగన్ పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నిక జరగనుండగా, లేళ్ల అప్పిరెడ్డిని ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. కాగా, ఈ జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న మర్రి రాజశేఖర్‌కు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే వార్తలొస్తున్నాయి. గతంలో జగన్ మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు.
కానీ, వివిధ కారణాల వల్ల ఇంత వరకు ఆ కోరిక నెరవేర్చలేకపోయారు. కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎమ్మెల్సీలు ఇవ్వడం ద్వారా వారికి తను వ్యతిరేకం కాదనే సంకేతాలు వైసీపీ అధినేత ఇవ్వాలని భావిస్తున్నారట.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.