YS Jagan : “ఆ ప్రాంతం విషయంలో తప్పు చేశానా” సతమతం అయిపోతున్న జగన్
YS Jagan : ఏపీకి మూడు రాజధానులు అనే అంశాన్ని సీఎం జగన్ లేవనెత్తిందే రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాలని. దాన్నే అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ.. ఒక్క అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉంటే జరగదని సీఎం జగన్ భావించి.. పరిపాలన రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ధి జరిగేలా వైజాగ్ లో ఏర్పాటు చేయాలని, న్యాయ రాజధాని అంటే హైకోర్టు కర్నూలులో ఉండేలా చేసి రాయలసీమ అభివృద్ది జరగేలా చేయాలని భావించారు. ఎలాగూ శాసనసభ అమరావతిలో ఉంది కాబట్టి.. దాన్ని అలాగే శాసన రాజధానిగా చేయాలని సీఎం జగన్ భావించారు.
కానీ… మూడు రాజధానుల అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. హైకోర్టు మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు కర్నూలుకు ఎలాగైనా హైకోర్టు ఇవ్వాల్సిందే అనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైకోర్టు సాధన సమితి, రాయలసీమ సంఘాలు అనే గ్రూపులు ఏర్పడి నిరసన తెలుపుతున్నాయి. తొలి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ వాసులు వాదిస్తున్నారు. న్యాయ రాజధాని విషయంలో రాయలసీమలో ఇంత ఉద్యమం నడుస్తుంటే వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మాత్రం ఎలాంటి నిరసన వ్యక్తం కావడం లేదు.
YS Jagan : వైజాగ్ లోనే పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని ఎందుకు ఉద్యమాలు జరగడం లేదు?
కేవలం అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఇతర నేతలు మాత్రమే వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని అంటున్నారు. సీఎం జగన్ కూడా తాజాగా అసెంబ్లీ వేదికగా త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన ప్రారంభం కాబోతోందని చెప్పారు. సుప్రీం కోర్టులోనూ మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ.. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఎందుకో వైసీపీ ప్రభుత్వం చేసే పనులపై ఎలాంటి డిమాండ్లు చేయడం లేదు. ఇది ఒకరకంగా ప్రభుత్వానికే అంతుచిక్కడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వైసీపీ పార్టీకి, ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర విషయంలో సీఎం జగన్ వైఖరి ఎలా ఉంటుందో?