YS Jagan : ‘రెడ్డి’ గారిని కాదని మరీ అతనికే టికెట్ ఇవ్వబోతోన్న జగన్.. వైసీపీ క్యాడర్ మొత్తం ఆమ్మో అనుకునే న్యూస్
YS Jagan : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయాలు ఏపీలో వేడెక్కాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ఫోకస్ మొత్తం ప్రస్తుతం కుప్పం మీద పెట్టారు. దానికి కారణం.. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకే.. ఇప్పటికే కుప్పం, రాజాం మండలాల్లోని వైసీపీకి చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.వైసీపీ నేతలతో సుదీర్ఘ చర్చ అనంతరం.. కుప్పం నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా రెండేళ్లకు కానీ ఎన్నికలు రావు. కానీ.. ఇప్పటికే కుప్పంలో వైసీపీ అభ్యర్థిని ప్రకటించినంత పని చేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ భరత్ ను వైఎస్ జగన్ సంసిద్ధం చేస్తున్నారు.
YS Jagan : పెద్దిరెడ్డిని కాదని భరత్ కు ఎందుకు టికెట్ ఇస్తున్నట్టు?
నిజానికి కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే వాళ్ల పేర్లు చాలానే వినిపించాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కొడుకు సుధీర్ రెడ్డిని కుప్పం నుంచి బరిలోకి దించుతారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే భరత్ కు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇక మిగిలింది సుధీర్ రెడ్డినే. కానీ.. జగన్ మాత్రం సుధీర్ రెడ్డి కాకుండా భరత్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. భరత్ కే కుప్పం టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ సామాజికవర్గం ఉంది. గత ఎన్నికల్లో భరత్ తండ్రి చంద్రమౌళి.. చంద్రబాబుతో ఢీకొట్టారు. కానీ.. ఆరు సార్లు రికార్డు స్థాయి మెజారిటీ దక్కించుకున్న చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో మాత్రం తగ్గింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. కుప్పం నియోజకవర్గంలో ఏ ఎన్నికల జరిగినా అది వైసీపీ వశం అయింది. అందుకే.. ఈసారి ఒక యువకుడిని బరిలోకి దించి చంద్రబాబును దెబ్బకొట్టాలనేది సీఎం జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే.. ముందే ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భరత్ పేరును సీఎం జగన్ బలపరిచారట. కాకపోతే.. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మాత్రం పెద్దిరెడ్డి చూసుకుంటున్నారు. ఈసారి మాత్రం భరత్ ను ముందుకు పెట్టి చంద్రబాబును ఢీకొట్టిస్తున్నారు. అక్కడ రెడ్డిల కన్నా బీసీలే ఎక్కువగా ఉండటంతో బీసీలను తమవైపునకు తిప్పుకోవడం కోసమే భరత్ కు టికెట్ ఇచ్చి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టాలనేదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.