YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల నవీనికరణకు మరియు కొత్తగా నిర్మించాల్సిన విమానాశ్రయాలను గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాయడం జరిగింది. గత కొన్నాళ్లుగా విమానాశ్రయాల విస్తరణ మరియు కొత్త విమానాశ్రయాల నిర్మాణం గురించి ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కొత్త జిల్లాల ప్రకటన తో సీఎం జగన్ మోహన్ రెడ్డి విమానాశ్రయాల నిర్మాణం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విమానాశ్రయాలు ఉండటం వల్ల అభివృద్ధి మరింతగా సాధించవచ్చు అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆయన కేంద్రంతో పలు దఫాలుగా చర్చించి పలు కొత్త విమానాశ్రయాలకు అనుమతులను తీసుకు వచ్చారు.
బోగాపురంకి కొత్త విమానాశ్రయం ఇప్పటికే మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇక విభజన చట్టంలో ఉన్న విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నాడు. విశాఖ నేవీ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు చేస్తున్నాయి. దాంతో విస్తరణ నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గంటకు పది విమానాలకు అనుమతులు వస్తున్నాయి. ఇలా అటు సైనిక అవసరాలకు మరియు డొమెస్టిక్ ప్రయాణికులకు విమానాశ్రయంలో డిమాండ్ పెరిగింది. దాంతో విశాఖ ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ ఏర్పాటు గా మారడం జరిగింది.ఈ కారణంగానే విశాఖ ఎయిర్ పోర్ట్ ను విస్తరించండి
అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయమై వెంటనే స్పందించాలని విమానయాన శాఖ మంత్రి వర్యులు ఏపీ లోని విమాన ఎయిర్ స్టేషన్ కి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ నా లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులు మరియు ప్రధాని తో కూడా ఏపీ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లు మరియు కొత్తగా అందవలసిన ఎయిర్ పోర్ట్ ల గురించి చర్చ జరగడం జరిగింది. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన హయాంలోనే కొత్త ఎయిర్ పోర్ట్ లకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.