YSRCP : ప్రతిపక్షాలను గడగడా వణికించే ఆ సీనియర్ నేతను.. సీఎం జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : ప్రతిపక్షాలను గడగడా వణికించే ఆ సీనియర్ నేతను.. సీఎం జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు?

 Authored By sukanya | The Telugu News | Updated on :13 August 2021,5:59 pm

YSRCP గుంటూరు : గుంటూరు జిల్లాలో ఎంతో మంది ఆశావాహులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణలతో జిల్లా ఆశావాహుల లిస్ట్ నుంచి ఒక వికెట్ డౌన్ అయిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావడంతో మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల భారీగా నామినేషన్ పోస్టులు భర్తీ చేయడం, మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పదవులు కట్టబెట్టడంతో కొంతమంది ఆశావాహులు మెత్తబడ్డారు. ఐతే ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో మాత్రం ఇంకా మంత్రిపదవులపై ఆశలున్నాయి. దీంతో ఎవరికివారు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి పదవుల రేసులో ఉన్నవారిపై సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటి వారిలో ముందున్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

ys jagan

ys jagan


ఆడియో లీక్ తో రచ్చ YSRCP

విపక్షాలపై ఎదురుదాడి చేసే పార్టీ ప్రధాన అస్త్రాల్లో అంబటి రాంబాబు ఒకరు. వైసీపీ ఆవిర్భావం నుండి అధికార ప్రతినిధిగా వైఎస్ జగన్ వెన్నంటి నడుస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం అంబటికి మంత్రి పదవి గ్యారెంటీ అని టాక్ వినిపించింది. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల పదవి వరించలేదు. ఇప్పుడు మరోసారి మంత్రి పదవి రేసులో అంబటి రాంబాబు పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో అంబటి రాంబాబు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ అంబటి రాంబాబు సంజన అనే అమ్మాయితో మాట్లాడినట్టుగా వచ్చిన వాయిస్ రికార్డులు మీడియాలో హల్ చల్ చేశాయి. ఐతే సదరు మహిళతో గానీ, వాయిస్ రికార్డుతో గానీ తనకు సంబంధం లేదని వాదించిన అంబటి రాంబాబు తన రాజకీయ జీవితానికి మచ్చరాకుండా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ambati rambabu

ambati rambabu

అయితే తాజాగా అటువంటి ఆడియో లీకులపై రచ్చ సాగుతుండడంతో, తనకేమీ సంబంధం లేదని అంబటి వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, ఆయా ప్రచారాలను నమ్మవద్దని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. అయితే గతంలో కూడా వైసీపీ నేత, నటుడు పృథ్వీ కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కొని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కోల్పోయారు. తాజాగా ఈ ఆడియో లీక్ తో అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి రేస్ నుంచి ఔట్ అయ్యారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఇంకెంత రాద్దాంతం సాగుతుందో అని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణలను సీఎం జగన్ లైట్ గా తీసుకునే అవకాశాలు లేకపోవచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి రెండోసారి చుట్టుముట్టిన లీకుల వివాదం నుంచి అంబటి రాంబాబు ఏ విధంగా బయటపడతారో వేచి చూడాలి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది