
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నవేళ ఎమ్మెల్యేల అనార్హత వేటు అంశం వెలుగులోకి వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేల పై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించడం జరిగింది. ఇక రాత పూర్వక స్పందన కోసం ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగింది. ఇక వారి స్పందన దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకొనున్నారు. అయితే ఇన్ని రోజులు ఊరుకున్న పార్టీలు ఉన్న ఫలంగా చర్యలకు డిమాండ్ చేయడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు స్థానాలు నిజానికి వైసిపి పార్టీ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం రాజ్యసభ స్థానాలకు పోటీపడే అవకాశం కనిపిస్తుంది. ఇక అదే జరిగినట్లయితే ఎమ్మెల్యేల మద్దతుకి అడ్డుకట్ట వెయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలపై అనార్హత వేటు అంశం వెలుగులోకి రావడం జరిగింది. అయితే టిడిపిలోకి వెళ్లిన నలుగురు వైసిపి ఎమ్మెల్యేలపై మరియు వైసీపీలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలపై రెండు పార్టీలు పరస్పరం స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి . దీంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గత ఎన్నికల్లో వైసిపి పార్టీ 151 స్థానాలు టిడిపి 23 జనసేన ఒక స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే టిడిపి పార్టీ నుండి వల్లభనేని వంశీ మోహన్ ,వాసుపల్లి గణేష్ కుమార్ , మద్దాలి గిరి వైసిపి పార్టీలో చేరారు. ఇక గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవెల్లి శ్రీదేవి లపై వైసీపీ హై కమాండ్ వేటు వేయడం జరిగింది. ఇక ఈ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసిపి మరియు టిడిపి వేరువేరుగా స్పీకర్లకు ఫిర్యాదులు చేశాయి. దీంతో స్పీకర్ వారికి నోటీసులు పంపించారు.
అయితే నిజానికి వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగానే దీనిని అమలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమీపంలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం చూస్తుంది. ఒక్కో రాజ్యసభ సీట్ తగ్గించుకోవాలంటే దాదాపు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఈ లెక్కన వైసీపీకి అవసరమైన సంఖ్యాబలం ఉంది . కానీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఇలాగే అంచనాలు వేసుకుని దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అభ్యర్థుల మార్పుతో చాలామంది ఎమ్మెల్యేలు టిడిపి పక్షాన చేరుతున్నారు. ఇక అలాంటి వారికి అనర్హత వేటువేసి నియంత్రణ లోకి తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఈ విధంగా చేయడం వలన టిడిపిలో చేరికలకు అడ్డుకట్ట వేయవచ్చని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధ్విముక వ్యూహంతో జగన్ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.