” అబ్బే కుదరదు అన్నా .. ఇంపాజిబుల్ ” వాళ్ళకి ఫేస్ మీదనే ఆ మాట చెప్పేసిన వైఎస్ జగన్
Ys jagan : ఇండియాలో సినిమా ఇండస్ట్రీలో మరియు రాజకీయాల్లో వారసులు రాజ్యం ఏలుతున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం మంది వారసులే ఉంటారు అనడంలో సందేహం లేదు. బీజేపీ వారసత్వ రాజకీయాలకు కాస్త వ్యతిరేకం అయినా కూడా ఇతర పార్టీలు మాత్రం పూర్తిగా వారసత్వం తోనే నడుస్తున్నాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడు కాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి వారసుడు అనే విషయం తెల్సిందే. కాని ఏపీలో కార్పోరేషన్ ఎన్నికల్లో మాత్రం వారసులకు ముఖ్యమంత్రి వెస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కకు పెట్టాడు.
Ys jagan : విశాఖలో ముత్తంశెట్టికి నిరాశ..
మంత్రి ముత్తంశెట్టి కూతురుకు కార్పోరేటర్ అవ్వాలనే ఆసక్తి లేదు. కాని ఆమె మేయర్ పీఠంపై ఆసక్తితో కార్పోరేటర్ గా పోటీ చేసింది. పోటీ చేసి గెలిచి నిలిచింది. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ గా పదవి దక్కుతుందని ముత్తం రెడ్డి ఆశ పడ్డాడు. కూతురుకు మేయర్ పీఠం ను ఇప్పించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan వద్ద చాలా పైరవీలు నిర్వహించాడు. కాని ఆయన పైరవీలు సాగలేదు. ఆయన కు సీఎం జగన్ మొండి చేయి చూపించారు. విజయనగరం కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా సీనియర్ నాయకుడు వైకాపా ఎమ్మెల్యే కుమార్తె ను మేయర్ గా చేసేందుకు కార్పోరేటర్ గా గెలిపించారు. కాని ఆమెకు కూడా మేయర్ కాని డిప్యూటీ మేయర్ కాని ఇచ్చేందుకు సీఎం ఒప్పుకోలేదు.
Ys jagan : వారసులకు నో ఛాన్స్..
రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా అయినా సీట్లు ఇచ్చేందుకు సిద్దం కాని మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవులను మాత్రం వారసులకు ఇచ్చి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావించడం లేదు అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan ఆ నాయకులతో అన్నాడట. మొదటే కొందరు తమ పిల్లలకు మేయర్ పీఠం కోసం సంప్రదింపులు జరుపగా జగన్ నో చెప్పడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు వీరు కూడా ప్రయత్నించి నిరాశ చెందారు. ముందు ముందు కూడా ఖచ్చితంగా తన పాలనలో వారసులకు ఛాన్స్ ఇవ్వనంటూ జగన్ అంటున్నాడు.