YS Jagan : బ్రేకింగ్.. జగన్ పల్లె నిద్ర – కొత్త ప్లాన్ తో దిగిన వైసీపీ !
YS Jagan : ఒకరు పాదయాత్ర.. ఇంకొకరు బస్సు యాత్ర.. ఇలా.. ఏ పార్టీల వాళ్లు తమకు తోచిన విధంగా యాత్రలు చేస్తూ ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడిని ప్రారంభించారు. నిజానికి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఒకరు పాదయాత్ర అంటారు.. మరొకరు ఇంకేదో అంటారు. బస్సు యాత్ర ఇలా.. ప్రతిపక్ష పార్టీలన్నీ యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే..
అధికార పార్టీ మాత్రం ఊరుకుంటుందా? అందుకే సీఎం జగన్ కూడా పల్లె నిద్ర పేరుతో ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.గత నెలలతోనే టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పేరుతో యాత్రను ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బస్సు యాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఎందుకో ప్రతిపక్షాలు ఈ విషయంలో కాస్త ముందున్నట్టే అనిపిస్తోంది.
YS Jagan :జగనే స్వయంగా పల్లెల్లో నిద్రించనున్నారా?
రాష్ట్రవ్యాప్తంగా పల్లె నిద్ర పేరుతో.. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పల్లెల్లో స్వయంగా సీఎంగా జగనే నిద్రించాలని అనుకుంటున్నారట. సీఎం జగనే స్వయంగా ఒక గ్రామానికి వెళ్లి బస చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ ఊరంతా తరలి రాదు. అందుకే.. జగనే పలు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారట. చూద్దాం మరి.. ఆ పల్లె నిద్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుందో. ఎప్పటి నుంచి సీఎం జగన్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారో.