జగన్ బ్లాక్ బస్టర్ స్కెచ్ – పవన్ నమ్ముకున్న ‘కాపు’ ఓటు బ్యాంక్ ఢమాల్ !
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ చతురతలో తల పండి పోయినట్లుగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే స్కెచ్ లు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలకు పైగానే ఉంది. అయినా కూడా మెల్ల మెల్లగా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద సంచలనంగా మారబోతుంది అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు. రాష్ట్రంలో కాపు వర్గంను తన వైపు తిప్పుకునేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ చర్చనీయాంశంగా మారింది.
ముద్రగడకు పెద్ద పదవి.. వైఎస్ జగన్
ఏపీలో కాపు అనగానే ఎక్కువ మంది నోట వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. కాపు సామాజిక వర్గంకు చెందిన వారు ఈయన్ను ఎంతగా నమ్ముతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్రగడ పద్మనాభం కు ఏపీలో పవన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది అనేది అందరు ఒప్పుకునే నిజం. కాపు సామాజిక వర్గంలో ఆయన బలమైన నేత అనడంలో సందేహం లేదు. అందుకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెల్లగా ఆయన్ను లైన్ లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ముద్రగడకు రాజ్యసభ సీటు ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయట.
వచ్చే ఎన్నికలే టార్గెట్..
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గంకు చెందిన ఓట్లతో పవన్ అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యం లేదంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గం మొత్తంను తన వైపు తిప్పుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కెచ్ వేశాడు. దాంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా కష్టమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ నమ్ముకున్న ఓటు బ్యాంక్ కు జగన్ గండి కొట్టేసినట్లే అంటున్నారు. ముద్రగడ తో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరిపారనే వార్తలు వస్తున్నాయి.