Ys Jagan : బద్వేలు గిఫ్ట్ అతనికే అంటున్న వైఎస్ జగన్..!
Ys Jagan ప్రస్తుతం బద్వేలు ఉప ఎన్నికల కోసం వైసీపీ సమాయత్తమవుతోంది. కడప జిల్లా బద్వేలులో ఎలాగైనా వైసీపీయే గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. పార్టీ కూడా ఇక్కడి గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఎలాగైనా సరే ఇక్కడ భారీ మెజార్టీ ఖాయమని జగన్ తో పాటు పార్టీ శ్రేణులు కూడా నమ్ముతున్నారు. ఇటువంటి సమయంలో బద్వేలులో మరో ఎన్నిక వైసీపీని ఆలోచింపజేస్తుంది. అదే బద్వేలు ఎమ్మెల్సీ ఎన్నిక. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా వైసీపీకే చెందిన డీసీ గోవింద రెడ్డి ఉన్నారు. ఈయన బద్వేలు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కావడం గమనార్హం.
అతి త్వరలో ఈయన పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో మరో సారి ఈయనకే ఎమ్మెల్సీ పగ్గాలు అప్పజెప్పాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గోవింద రెడ్డి పార్టీకి మంచి నమ్మకస్తుడు కావడం మరియు బద్వేలులో ఉప ఎన్నికలు ఉండడం కారణాలుగా తెలుస్తున్నాయి. త్వరలో 14 మంది ఎమ్మెల్సీల పదవులు భర్తీ కానున్నాయి. కానీ ఈ లిస్టులో గోవింద రెడ్డికి మాత్రం మరోసారి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గోవింద రెడ్డి మాత్రమే కాకుండా అనేక మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం గంపెడాశలతో ఉన్నారు. కానీ ఈ ఉప ఎన్నిక కారణంగా గోవింద రెడ్డినే మరోమారు పదవి వరించే అవకాశం ఉంది.
Ys Jagan : త్వరలో 14మందికి పదవులు..
కడపకే చెందిన మాజీ మంత్రి, రెడ్డి సామాజిక వర్గ నేత రామ సుబ్బారెడ్డికి కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రామ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ కావడం కోసం మరి కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే కడప జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే కోటా కిందనే ఎమ్మెల్సీని భర్తీ చేయాలి. దీంతో జగన్ రామసుబ్బా రెడ్డకి అవకాశం ఇస్తారా? లేక గోవింద రెడ్డినే కొనసాగిస్తారా? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.