YS Jagan : ఈ ఒక్క పని చేస్తే వైఎస్ జగన్ మరో 10 ఏళ్లు సీఎంగా కొనసాగవచ్చు
YS Jagan : ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై మెజార్టీ శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వే రిపోర్ట్ చెబుతోంది. సీఎం వైఎస్ జగన్ అమలు పర్చుతున్న నవరత్నాలు కూడా పేద మద్యతరగతి వారికి చాలా ప్రయోజనకారిగా ఉంటున్నాయని అంటున్నారు. ఇక విద్యా వ్యవస్థలో కూడా నాడు నేడు అంటూ చాలా మార్పులను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో దళిత గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. వారికి ఆపన్న హస్తం అందిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు గతంలో విదేశాల్లో విద్యార్థుల చదువుల విషయంలో బాగా ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు విదేశాల్లో వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి సాయంగా నిలిచేవారు.
YS Jagan : విదేశీ విద్యకు సహకారం అవసరం..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి గతంలో ఎంతో మందికి సాయంగా నిలిచారు. వారు విదేశాలకు వెళ్లి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగేలా చేశారు. కనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వారి విషయంలో శ్రద్ద పెట్టాలని కొందరు విద్యా వంతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులకు ఆర్థికంగా ఉన్నత చదువులకు సాయం చేస్తే ఖచ్చితంగా మంచి పేరు రావడంతో పాటు ఇతరులకు చదువుపై ఆసక్తి కలగడంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా నమ్మకం గౌరవం కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
YS Jagan : దళితులు, గిరిజనులకు అండగా…
ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశ పడుతున్న దళిత గిరిజన విద్యార్థలు చాలా మంది ఆర్థకంగా లేకపోవడంతో చదువును మద్యలో ఆపేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఎంఎస్ చేయాలని ఆశలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ నేపథ్యం కారణంగా వారు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి కనుక సీఎం జగన్ మోహన్ రెడ్డి సాయంగా నిలిస్తే ఖచ్చితంగా ఆయన మరో పదేళ్ల వరకు సీఎంగా ఉండటం ఖాయం అంటూ రాజకీయ వర్గాల వారు మరియు విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి విషయంలో కాస్త శ్రద్ద చూపించాలని విద్యావంతుల వేదిక కోరుతోంది.