YS Jagan : చేరికల జాబితా సిద్ధం.. టీడీపీ ఖాళీకి స్కెచ్ వేసిన సీఎం వైఎస్ జగన్
YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మిగిలి ఉండగానే ఇప్పటి నుంచే గెలుపుకోసం ప్రణాళికలు రచిస్తున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా అన్నింటినీ జగన్ నేరవేరుస్తూ వస్తున్నారు. మరోవైపు అసమ్మతి నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లపై ముందే క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, వ్యతిరేకత ఉన్న లీడర్లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవని కూడా జగన్ ముందే హింట్ ఇస్తున్నారట..
దీంతో లీడర్లంతా జగన్ ఆదేశాలను పాటించే పనిలో బిజీ అయిపోయినట్టు తెలుస్తోంది.నవరత్నాలు సమయానికి ప్రజలకు చేరువయ్యేలా జగన్ ప్రభుత్వం కృషి చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ కొన్ని వర్గాల ప్రజలు మాత్రం జగన్ పాలనపై గుర్రుగా ఉన్నారట.. జగన్ సీఎం అయ్యాక తమకు ప్రాధాన్యత తగ్గిందని వాపోతున్నారట. అందుకోసమే ఈ సారి ఆ వర్గం వారంతా మీటింగులు పెట్టుకుని మరీ వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకి మద్దతు ఇవ్వాలని చూస్తున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది.
ఇకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు కేటాయిస్తానని చెప్పడంతో లోకల్‌గా ఉండే సీనియర్ లీడర్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. వీరందరినీ జగన్ పార్టీ లీడర్లు నెమ్మదిగా బుజ్జగించి తమ పార్టీలో చేర్చుకునేలా స్కెచ్ గీస్తున్నారని తెలిసింది. ఇప్పటికే చాలా మంది సీనియర్ లీడర్లు జగన్ పై ఉన్న నమ్మకంతో వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట.. జగన్ ఒక్కసారి హామీ ఇస్తే ఎలాగోలా వారికి ఎదో ఒక పదవి కట్టబెడతారని లీడర్లు చెప్పుకుంటేున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారికి చెరో రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవులు ఇస్తానని చెప్పి జగన్ మాట మీద నిలబడ్డారని గుర్తుచేసుకుంటున్నారు. అంతా ఓకే అయితే ఆగస్టు నెల చివరి వారంలోపు టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది.