YS Jagan : ఈ ఒక్క లాజిక్‌తో కోర్టులో గెలవబోతున్న వైఎస్ జగన్.. ప్లాన్ కుమ్మేసింది!
YS Jagan : మూడు రాజధానుల అంశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. గతంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మార్పులు చేర్పులు చేసి మరోసారి ప్రవేశపెడతానని అసెంబ్లీలో వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారట.. ప్రస్తుతం ఆ బిల్లు న్యాయనిపుణుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లినా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావని వారు చెప్పిన మరుక్షణం మళ్లీ వాటిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.
YS Jagan : ఈసారి పకడ్భందీగా ప్లాన్ చేసిన జగన్..
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయింది. రాజధాని రైతులు అమరావతిని తరలించరాదని ఆందోళన చేయబట్టి కూడా 1000 రోజులు పూర్తయింది. గతంలో జగన్ తీసుకొచ్చిన బిల్లు శాసనసభలో పాసైన మండిలో వీగిపోయింది. అప్పుడు టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండేది.న్యాయస్థానాలు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కొట్టిపారేశాయి. అంతేకాకుండా అమరావతి రైతులకు ప్లాట్లు కేటాయించాలని, మూడు నెలల్లో రాజధాని నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఏదేమైనా జగన్ మాత్రం ఈసారి ఎలాగైనా మూడురాజధానుల విషయంలో పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అమరావతిలో శానస రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును సంప్రదించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని కేంద్రం పార్లమెంటులో స్పష్టంచేసింది. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజధాలనుల ఏర్పాటుపై శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగసవరణ చేయాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.