YS Jagan : విశాఖపట్నంకి అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా వైయస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
YS Jagan : వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్నం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. విశాఖపట్నం ఏపీకి ముఖ్య రాజధాని అని ఢిల్లీ నడిబొడ్డులో వైయస్ జగన్ కొద్ది రోజుల క్రితం కామెంట్లు చేయడం తెలిసిందే. తాను కుటుంబంతో అక్కడికి షిఫ్ట్ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు. ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ కార్యక్రమం మార్చి మూడు మరియు నాలుగు తారీకులలో జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఇతర దేశాల నుండి పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఇందుకు సంబంధించి…
రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున వేదికలు సిద్ధపరుస్తూ ఉంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా విశాఖపట్నంకి మరింత పేరు వచ్చేలా బ్రాండ్ క్రియేట్ అయ్యేలా… వైయస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునీ ముందడుగులు వేస్తూ ఉంది. “బ్యూటిఫికేషన్” పేరుతో విశాఖలో కొత్త బీచ్ లు, కొత్త పార్క్ లు, కొత్త రోడ్ లు నిర్మిస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తో పాటు జీ 20 సదస్సు కూడా జరగనున్న నేపథ్యంలో విశాఖపట్నంకీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దగ్గర… నగరం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా ఏపీ ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది. విశాఖపట్నం కి ప్రధాన ఆకర్షణ బీచ్ కావడంతో…
ఇక్కడ కొత్త బీచ్ లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం… ముందడుగులు వేస్తూ ఉంది. ప్రస్తుతం వైజాగ్ లో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అదనంగా మరో రెండు బీచ్ లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. జోడుగుల పాలెం, సాగర్ నగర్ లో యుద్ధ ప్రాతిపదికన కొత్త బీచ్ లను నిర్మిస్తున్నారు. సన్ రే బీచ్ సహకారంతో కొత్త బీచ్ లను ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. 50 అడుగుల ఎత్తున 200 కొబ్బరి చెట్లను తెప్పించి.. బీచ్ ఒడ్డున.. నాటుతూ ప్రకృతి అందం ప్రతిబించేలా ట్రాన్స్ ప్లాంట్ చేస్తున్నారు. బీచ్ లో అవసరమైన సౌకర్యాలు అన్నిటిని… అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.