YS Jagan : ‘అసని’ తుఫాన్… వైఎస్ జగన్ ముందస్తు నిర్ణయం
YS Jagan : గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని చిగురుటాకుల వణికిస్తున్న అసని తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్దం అయ్యింది. జాతీయ భద్రత బృందాలతో పాటు రాష్ట్ర రెవిన్యూ మరియు పోలీసు సిబ్బంది ముందస్తుగా ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ప్రాణ నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రి వర్యులు పలువురు ఎక్కడ ఎలాంటి భారీ ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పెద్ద ఎత్తున ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో విద్యుత్ ఉద్యోగులు ఏమాత్రం అలసత్వం పాటించకుండా ఉండాలని సీఎం ఆదేశించారు. రాత్రి సమయంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని.. తీర ప్రాంతాల వారిని ముందస్తు హెచ్చరికలతో వారికి అవగాహణ కల్పించారు. మొత్తానికి తుఫాన్ విషయం తెలిసిన వెంటనే 24 గంటలు తిరగకుండానే మొత్తం అన్ని ఏర్పాట్లను చేయడం లో ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది.

YS Jagan video conference with govt officials on asani cyclone
ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా మానవతా ద్రృక్పదంతో వ్యవహరించాలని.. సాయం అని వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సాయం అందించాలంటూ సీఎం జగన్ సూచించారు. మొత్తం పది మంది మంత్రులు తుఫాన్ కు సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా ఉండి సమీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని మార్గాల ద్వారా జనాల్లో అవగాహణ తీసుకు వచ్చి జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. దాంతో తుఫాన్ ప్రభావం నుండి కొద్ది మేరకు అయినా నష్టం తప్పే అవకాశం ఉందంటున్నారు.