వ్యాక్సిన్ బాబు తెస్తే మనం ఏం చేస్తాం జగనన్నా..?
Chandrababu : ఏపీలో కరోనా అదుపులోనే ఉందంటూ ప్రభుత్వ వర్గాల వారు పదే పదే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లుగా చెబుతూనే అందుబాటులో వ్యాక్సిన్ లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం చేతకాకుండా వ్యవహరిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Chandrababu : బాబు వ్యాక్సిన్ నువ్వు ఇవ్వు…
వ్యాక్సినేషన్ పక్రియపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడంతో వైకాపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైకాపా నాయకులు మరియు మంత్రులు కూడా బాబు ఈ సమయంలో విమర్శలు చేయడం సరి కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ ను తెప్పించి ఇస్తే తప్పకుండా మేము ఆ వ్యాక్సిన్ ను వేస్తామంటూ వైకాపా వారు అనడంతో వివాదం చెలరేగుతోంది. చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ ఎందుకు తీసుకు వస్తాడంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే ఇదే ఎదురు దాడి అంటూ స్వయంగా వైకాపా కార్యకర్తలు కొందరు అంటున్నారు.
మనం ఏం చేద్దాం జగనన్నా..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును వైకాపా నాయకులు కొందరు వ్యాక్సిన్ నువ్వు తీసుకు వస్తే మేము వేస్తాం అంటూ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు వ్యాక్సిన్ తీసుకు వస్తే మనం ఏం చేద్దాం జగనన్నా అంటూ ఆ పార్టీ నాయకులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఎదుటి వారు విమర్శలు చేశారంటూ మనము ప్రతి విమర్శలు చేయడం ఏమాత్రం సరి కాదు. ప్రజలు ఈ సమయంలో ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తున్నారు. కనుక ప్రతిపక్షాల కు అవకాశం ఇచ్చే విధంగా విమర్శలు చేయవద్దంటూ వైకాపా కార్యకర్తలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.